Thyroid Symptoms : ఈ ల‌క్ష‌ణాలు మీలో క‌నిపిస్తున్నాయా.. అయితే డౌటే లేదు.. అది థైరాయిడ్ స‌మ‌స్యే..!

March 16, 2023 2:57 PM

Thyroid Symptoms : మీకు తెలుసా.. ఏదైనా వ్యాది మనల్ని అటాక్ చేయడానికి ముందు మన శరీరం మనకు సిగ్నల్స్ ఇస్తుంది. చిన్న చిన్న సమస్యలే కదా అని లైట్ తీసుకుంటే అవి పెద్దగా పరిణ‌మించే అవకాశాలుంటాయి. పదేళ్ల క్రితం థైరాయిడ్ సమస్య వల్ల మూడు శాతం మంది ఇబ్బందులు ప‌డేవారు. కానీ ఇటీవల నిర్వహించిన సర్వేలో తేలిన విషయం ఏంటంటే ప్రతి ఏటా పన్నెండు మిలియన్ల మంది థైరాయిడ్ బారిన పడుతున్నారని తేలింది. కాబట్టి మన శ‌రీరం ఇచ్చే సంకేతాలను బట్టి ముందుగానే సమస్యను గుర్తిస్తే కొంతవరకైనా సుర‌క్షితంగా బయటపడే అవకాశం ఉంటుంది. థైరాయిడ్ స‌మ‌స్య ఉంద‌ని సూచించే తొమ్మిది ల‌క్ష‌ణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

నెమ్మదించిన జీవక్రియ వలన మీ శరీరం చెమటపట్టకుండా ఉండి చర్మం పొడిబారడం, దురద పుట్టడం లాంటి లక్షణాలు కనపడ‌తాయి. దాంతోపాటు ఎక్కువ సంఖ్యలో మీ జుట్టు రాలడం కూడా థైరాయిడ్ సంకేతంగా భావించవచ్చు. థైరాయిడ్ మన శృంగార జీవితంపై ప్రభావం చూపిస్తుంది. దీనివల్ల మీకు శృంగారం పైన ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. కాబట్టి మీరు శృంగారం పట్ల ఇంతకు ముందులా యాక్టివ్ గా ఉన్నారా లేదా గమనించుకోండి. మీరు బరువు పెరగడానికి మీ ఆహార పద్దతి ఒక కారణం అయితే ఎటువంటి కారణం లేకుండా మీరు బరువు పెరిగినా, ఆకలి బాగా ఉండి ఎంత తింటున్నా బరువు తగ్గుతున్నా కూడా థైరాయిడ్ లక్షణమే.

Thyroid Symptoms if you have these then must know them
Thyroid Symptoms

థైరాయిడ్ హార్మోన్ రిలీజ్ అయ్యే పరిమాణంపైనే మీ మూడ్ కూడా ఆధారపడి ఉంటుంది. అకారణంగా ఎవరిపైన అయినా కోపం వస్తున్నా.. అలసటగా ఫీల్ అవ్వడం, డిప్రెషన్ కు గురికావడం.. థైరాయిడ్ ల‌క్ష‌ణాల‌ని చెప్ప‌వచ్చు. కాళ్లు, చేతులు వణకడం.. ఎక్కువగా తిమ్మిరులు రావడం, అరికాళ్లు, అరిచేతులు ఎక్కువగా చెమట పట్టడం అనేది థైరాయిడ్ హార్మోన్ ప్రభావం వలనే జ‌రుగుతుంది. హైపో థైరాయిడిజం ముఖ్య లక్షణం జీర్ణక్రియ అస్తవ్యస్తంగా మారడం. తత్ఫలితంగా మలబద్దకం సమస్య ఎదురవుతుంది. అంతకుముందు మీకు ఎటువంటి జీర్ణ స‌మ‌స్య‌లు, మలబద్దకం లాంటివి లేకుండా ఉంటే ఈ సమస్యను థైరాయిడ్ ల‌క్ష‌ణంగా పరిగణించాలి.

తరచుగా మీ హార్ట్ బీట్ ఎక్కువగా ఉన్నా.. గుండెల్లో వణుకుగా అనిపించినా కూడా డాక్టర్ ను సంప్రందించాలి. హైపోథైరాయిడిజం వలన మీ కంటి చూపు మసకబారినట్టుగా ఉంటుంది. మీ మెదడు కూడా ఇంతకు ముందులా యాక్టివ్ గా ఉండకుండా బద్దకం ఆవహించినట్టుగా అనిపిస్తుంటుంది. రోజువారీ పనులలో కూడా యాక్టివ్ గా ఉండలేక ఎప్పుడూ నిద్ర వస్తున్న ఫీలింగ్ లో ఉండడం, బద్దకంగా ఉండడం కూడా థైరాయిడ్ లక్షణాలు అని చెప్ప‌వచ్చు. క‌నుక ఈ ల‌క్ష‌ణాలు ఎవ‌రిలో అయినా ఉంటే వాటిని థైరాయిడ్‌గా అనుమానించాలి. వెంట‌నే టెస్టులు చేయించుకోవాలి. థైరాయిడ్ ఉంద‌ని తేలితే డాక్ట‌ర్ సూచ‌న మేర‌కు మందుల‌ను వాడుకోవాలి. దీంతో సుర‌క్షితంగా ఉండ‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now