అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో విడుద‌లైన రియ‌ల్‌మి కొత్త 5జీ స్మార్ట్ ఫోన్‌..!

June 27, 2021 8:47 PM

మొబైల్స్ త‌యారీదారు రియ‌ల్‌మి.. నార్జో 30 5జి పేరిట ఓ నూత‌న స్మార్ట్ ఫోన్‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. ఇందులో ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. 6.5 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ ల‌భిస్తుంది. అందువ‌ల్ల డిస్‌ప్లే క్వాలిటీ బాగుంటుంది.

realme narzo 30 5G smart phone launched in india

ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెస‌ర్‌ను అమర్చారు. అందువ‌ల్ల 5జి సేవ‌ల‌ను పొంద‌వ‌చ్చు. 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఆప్ష‌న్‌లో ఈ ఫోన్ ల‌భిస్తుంది. మెమొరీని కార్డు ద్వారా 1 టీబీ వ‌రకు పెంచుకోవ‌చ్చు. డ్యుయ‌ల్ సిమ్‌ల‌ను వేసుకోవ‌చ్చు. ఆండ్రాయిడ్ 11 ఓఎస్ ల‌భిస్తుంది.

ఈ ఫోన్‌లో వెనుక భాగంలో 48 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరాను ఏర్పాటు చేశారు. దీనికి తోడు మ‌రో 2 మెగాపిక్స‌ల్ బ్లాక్ అండ్ వైట్ కెమెరా, ఇంకో 2 మెగాపిక్స‌ల్ మాక్రో సెన్సార్‌ల‌ను అమ‌ర్చారు. ముందు వైపు 16 మెగాపిక్స‌ల్ కెమెరా ఉంది. ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్ ప‌క్క వైపుకు ఇచ్చారు. డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.1, యూఎస్‌బీ టైప్ సి ఫీచర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి. ఇందులో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న భారీ బ్యాట‌రీని ఏర్పాటు చేశారు. దీనికి ఫాస్ట్ చార్జింగ్ స‌పోర్ట్ ల‌భిస్తుంది.

రియ‌ల్‌మి నార్జో 30 5జి స్మార్ట్ ఫోన్ ధ‌ర రూ.15,999గా ఉంది. దీన్ని జూన్ 30 నుంచి విక్ర‌య‌స్తారు. ఫ్లిప్‌కార్ట్‌తోపాటు రియ‌ల్‌మి ఆన్‌లైన్ స్టోర్‌, ఇత‌ర ఆఫ్‌లైన్ స్టోర్స్ లో ఈ ఫోన్‌ను కొన‌వ‌చ్చు. మొద‌టి సేల్‌లో ఈ ఫోన్‌పై రూ.500 త‌గ్గింపును అందించ‌నున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment