Jathara Movie : ఈ సినిమాకు చిరంజీవి రెమ్యున‌రేష‌న్‌ ఎంతో తెలుసా..? షాక‌వుతారు..!

February 19, 2023 1:01 PM

Jathara Movie : మెగాస్టార్ చిరంజీవి త‌న కెరీర్‌లో ఎన్నో అద్భుత‌మైన చిత్రాల్లో న‌టించారు. ఇక ఆయ‌న ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన కొత్త‌లో అనేక విభిన్న‌మైన మూవీల‌ను చేశారు. ముఖ్యంగా ప్రాణం ఖరీదు, పునాదిరాళ్ళు, మనవూరి పాండవులు వంటి సినిమాలతో ఆక‌ట్టుకున్నారు. ఇక అప్ప‌ట్లోనే జాతర అనే సినిమాను 1979లో తీశారు. ధవళ సత్యం దీనికి డైరెక్టర్. ఈయనకు ఇది మొదటి సినిమా. నిజానికి నరసింహరాజు అప్పటికి చాలా సినిమాలతో ఆకట్టుకుంటుంటే అతడితోనే తీయొచ్చు కదా అని కొందరు సలహా ఇచ్చినా సరే చిరుతో జాతర తీశామని నిర్మాత రాజు చెప్పారు.

ఇప్పటికీ చిరంజీవి మెగాస్టార్ గా ఉన్నత స్థానంలో ఉన్నా సరే.. ఆప్యాయంగా పలకరిస్తుంటారని.. ఇది తమ భాగ్యంగా భావిస్తామని రాజు చెప్పారు. నేను పుట్టిన ఊళ్ళోనే తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లిలో 45 రోజులు షూటింగ్ చేశామని ఓ ఇంటర్యూలో నిర్మాత రాజు తెలిపారు. హీరో బ్రదర్ గా శ్రీధర్, విలన్ గా నాగభూషణం చేశారు. అందరూ కూడా సఖినేటిపల్లి వచ్చి షూటింగ్ లో పాల్గొన్నారు.

Jathara Movie chiranjeevi remuneration
Jathara Movie

సినిమా ఆర్థికంగా లాభం తీసుకు రాకపోయినా మంచి పేరు తెచ్చింది. అందరూ జాతర రాజు గారు అని నిర్మాతను పిలిచేవారట. నరసాపురం వరకూ రైలులో వచ్చి అక్కడనుంచి పడవల మీద సఖినేటిపల్లి చేరుకొని బంధువుల ఇళ్లల్లోనే అందరినీ ఉంచి షూటింగ్ చేశారు. ఆ సినిమాకు చిరంజీవికి 10వేల రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చారు. ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే ప్రివ్యూ చూసిన మాదాల రంగారావు.. నవతరం కదిలింది మూవీకి డైరెక్టర్ గా ధవళ సత్యంను కన్ఫర్మ్ చేసుకున్నారు. అయితే చిరంజీవి ఇప్పుడంటే కోట్ల రూపాయ‌లు రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నారు కానీ.. ఒక‌ప్పుడు ఆయ‌న ఎంత పారితోషికం తీసుకున్నారో తెలిస్తే.. ఎవ‌రైనా స‌రే షాక్‌కు గుర‌వుతారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment