Swayam Krushi Movie : స్వ‌యంకృషి షూటింగ్ స‌మ‌యంలో ప‌డుకున్న చిరు.. విశ్వ‌నాథ్ ఏం చేశారంటే..?

February 15, 2023 11:18 AM

Swayam Krushi Movie : డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనే పదానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది స్వయంకృషి సినిమా. అప్పటివరకు మాస్‌ ఇమేజ్‌లో తడిసిముద్దవుతున్న చిరంజీవిలోని మరో యాంగిల్‌ను సినీ ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌యం చేసింది ఈ చిత్రం. స్వయంకృషితో చిరంజీవిలోని మరో కోణాన్ని చూపించిన విశ్వనాథ్ ని ఎంత మెచ్చుకున్న త‌క్కువే. 1987లో ఏడిద నాగేశ్వరరావు నిర్మాతగా కె.విశ్వనాథ్ దర్శకత్వంలో స్వయంకృషి సినిమా విడుదలైంది. ఈ సినిమాలో చిరంజీవి, విజయశాంతి హీరో, హీరోయిన్లుగా నటించ‌గా, బాల నటుడు మాస్టర్ అర్జున్ మరో ప్రధాన పాత్రలో కనిపించాడు.

ఖైదీ, కొండవీటి రాజా, అడవిదొంగ, పసివాడి ప్రాణం లాంటి బ్లాక్ బస్టర్స్ సినిమాల‌తో టాప్ పొజిషన్‌కి ఎదుగుతున్న చిరంజీవి కమర్షియల్ సర్కిల్‌ నుంచి బయటకు వచ్చి స్వయంకృషి అనే సినిమా చేశాడు. ఈ సినిమా చిరంజీవిని సరికొత్తగా ఆవిష్కరించడమే కాకుండా.. ప్రయోగాలతో కూడా చిరంజీవి సక్సెస్ కొట్టగలరని నిరూపించింది. ఇందులో చిరంజీవి పాత్ర‌ను గొప్ప‌గా చెక్కారు క‌ళా త‌ప‌స్వి కె విశ్వ‌నాథ్‌. అయితే ఈ సినిమా షూటింగ్ స‌మ‌యంలో ఓ ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న చోటు చేసుకుంది. షూటింగ్ బ్రేక్ స‌మ‌యంలో విశ్వ‌నాథ్ గారు భోజనం చేస్తూ ఉంటే చిరంజీవి మాత్రం పడుకున్నారట. దాంతో చిరంజీవి భోజనం చేశారా లేదా అని విశ్వనాథ్ గారు సిబ్బందిని అడ‌గ‌గా, ఆయ‌న మధ్యాహ్నం భోజనం చేయరని డైట్ లో ఉన్నారని చెప్పారు.

Swayam Krushi Movie making interesting incident happened
Swayam Krushi Movie

అప్పుడు విశ్వనాథ్ స్వయంగా ప్లేట్ లో అన్నం వేసి అందులో పెరుగు వేసి తానే కలిపి చిరంజీవికి ఇవ్వండని పంపించారు. అయితే చిరుని నిద్ర లేపే సాహ‌సం ఎవ‌రు చేయ‌లేదు. కానీ అదే సమయంలో అక్కడ గుడి గంట మోగగా, ఆ శబ్దానికి చిరు లేచి కూర్చున్నారు. ఇక అప్పుడే విశ్వనాథ్ గారు చిరంజీవి అన్నం తిను అని చెప్పడం తో మహా ప్రసాదం అని తిన్నారు. ఈ విషయాన్ని చిరు చాలా ఇంటర్వ్యూ లలో చెప్పి సంతోషం వ్యక్తం చేశారు. విశ్వ‌నాథ్ గారంటే చిరంజీవికి ఎంతో అభిమానంతో పాటు ప్రేమ కూడా ఉండేది. ఆ మ‌ధ్య ఓ సారి చిరంజీవి త‌న స‌తీమ‌ణితో విశ్వ‌నాథ్ ఇంటికి వెళ్లి మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిసి వ‌చ్చారు. ఇక విశ్వ‌నాథ్ మృతి ప‌ట్ల చిరు దిగ్భ్రాంతికి లోన‌య్యారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now