Pawan Kalyan : త‌న అన్న‌య్య రివాల్వ‌ర్ తీసుకొని కాల్చుకోవాల‌ని అనుకున్న ప‌వ‌న్ .. ఎందుకో తెలుసా?

February 10, 2023 9:34 PM

Pawan Kalyan : ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇటీవ‌ల బాల‌కృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాప‌బుల్ ఎపిసోడ్‌కి గెస్ట్‌గా వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈ షోలో ఆయ‌న సినీ, రాజ‌కీయాల‌కి సంబంధించి ఆస‌క్తికర ప్ర‌శ్న‌లు సంధించాయి బాలయ్య .అయితే చిన్నతనంలోనే ఎన్నో సంఘటనలను చూశానని మానసికంగా కృంగి పోయానని చెప్పిన ప‌వ‌న్… అనారోగ్య పరిస్థితుల కారణంగా స్నేహితులతో కలవలేక పోయేవాడిని.. స్కూల్ కి సరిగా వెళ్లలేక పోయేవాడిని. దాంతో 17 ఏళ్ల వయసులో మానసికంగా కృంగి పోయి చనిపోవాలనుకున్నాను. ఓ సారి అన్నయ్య లైసెన్స్ రివాల్వర్ తీసుకొని కాల్చుకుందాం అనుకున్నాను.

అప్పుడే వదిన సురేఖ న‌న్ను గమనించారు. ఎందుకలా ఉన్నావ్ అంటూ ప్రశ్నించడంతో చనిపోవాలనిపిస్తుందని చెప్పాను. దాంతో అన్నయ్య వద్దకు వదిన తీసుకు వెళ్లారు. అప్పుడు అన్నయ్య పరీక్షలపై గురించిన ఆలోచన అక్కర్లేదు బతికి ఉండరా అని అన్నాడు. ఒళ్ళు దాచుకోకుండా కష్టపడే తత్వాన్ని అన్నయ్య నుండి నేర్చుకున్నాను. రాజకీయాల్లో విమర్శలు కచ్చితంగా స్వీకరించాల్సిందే ఎన్ని విమర్శలు అయినా భరించాల్సిందే. దాన్ని కూడా నేను అన్నయ్య నుండి నేర్చుకున్నాను అని ప‌వ‌న్ తెలిపారు. సినీ పరిశ్రమలో పేరు ఉన్న వ్యక్తి రాజకీయాల్లోకి ప్రవేశించి అంతటి నమ్మకం పొందాలంటే కాస్త సమయం పడుతుంది. రాత్రికి రాత్రి అద్భుతాలు జరుగుతాయని నేను అనుకోను. అందుకే కచ్చితంగా భవిష్యత్తులో జనాలు మార్పు కోరుకుంటారని అన్నారు పవన్ కళ్యాణ్.

Pawan Kalyan sensational comments on her brother
Pawan Kalyan

విశాఖపట్నంలో జరిగిన సంఘటన గురించి పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.. నేను ఒక అడుగు వేసినా మాట్లాడాలనుకున్నా ప్రభుత్వంలో ఉండే వారికి ఇబ్బందిగా ఉంటుంది. నేను మామూలుగా చేసిన దాన్ని ఏదోలా చేస్తున్నారు.. నేను వైజాగ్ వెళ్లకూడదని ఎన్నో కుట్రలు చేశారు. ఓ మహిళపై అక్రమంగా కేసు పెట్టారు.. ఆధిపత్య ధోరణి కి అది నిదర్శనం. నేను నోరు ఎత్తితే మూసి వేసేందుకు అని ప్రయత్నాలు చేస్తున్నారు. నల్గొండ జిల్లాలో ఒకప్పుడు ఫ్లోరోసిస్ సమస్య తీవ్రంగా ఉండేది. ఆ జిల్లాలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని మంచి నీటిని అందించాలని ప్రయత్నించాను. అందుకోసం కొంత మందిని సంప్రదించాను. కానీ అక్కడ రాజకీయ గ్రూప్స్ అడ్డుకున్నాయి. మంచి చేయడానికి కూడా అడ్డంకులు ఉంటాయి అని అప్పుడే తెలిసింది. ఎన్జీవో తో సరిపోదు ఏదోచేయాల‌నే ఆలోచనతో పార్టీ ఏర్పాటు చేసి ప్రజల్లోకి వెళ్లాను అని ప‌వ‌న్ అన్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now