రియ‌ల్‌మి కొత్త ఫోన్‌.. ఫీచ‌ర్లు చూస్తే షాక్ అవుతారు..!

June 25, 2021 12:23 PM

మొబైల్స్ త‌యారీదారు రియ‌ల్‌మి.. నార్జో 30 పేరిట ఓ నూత‌న స్మార్ట్ ఫోన్‌ను తాజాగా భార‌త్‌లో విడుద‌ల చేసింది. ఈ ఫోన్‌లో ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. ఇందులో 6.5 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అందువ‌ల్ల డిస్‌ప్లే క్వాలిటీ బాగుంటుంది. ఈ ఫోన్‌లో ముందు భాగంలో 16 మెగాపిక్స‌ల్ పంచ్ హోల్ కెమెరాను ఏర్పాటు చేశారు. మీడియాటెక్ హీలియో జి95 ప్రాసెస‌ర్ ఉంది. 6జీబీ ర్యామ్ ల‌భిస్తుంది.

realme narzo 30 smart phone launched in india

ఫోన్‌కు వెనుక వైపు 48 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరాకు తోడుగా మ‌రో 2 మెగాపిక్స‌ల్ బ్లాక్ అండ్ పోర్ట్రెయిట్ కెమెరా, 2 మెగాపిక్స‌ల్ మాక్రో కెమెరాల‌ను ఏర్పాటు చేశారు. అలాగే ఈ ఫోన్‌లో సైడ్ మౌంటెడ్ ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డెడికేటెడ్ డ్యుయ‌ల్ సిమ్‌, మైక్రో ఎస్‌డీ కార్డు స్లాట్స్‌, 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్ ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు.

30 వాట్ల డార్ట్ చార్జ్ ఫీచ‌ర్ ఉన్నందున 25 నిమిషాల్లోనే ఈ ఫోన్ 50 శాతం చార్జింగ్ అవుతుంది. 65 నిమిషాల్లో 100 శాతం చార్జింగ్ అవుతుంది. ఈ ఫోన్ 4జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్‌, 6జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ ఆప్ష‌న్ల‌లో ల‌భిస్తుంది. మెమొరీని కార్డు ద్వారా 256 జీబీ స్టోరేజ్ వ‌ర‌కు పెంచుకోవ‌చ్చు. డ్యుయల్ సిమ్‌లు వేసుకోవ‌చ్చు. ఆండ్రాయిడ్ 11 ఓఎస్ ల‌భిస్తుంది. డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి త‌దిత‌ర ఇత‌ర ఫీచ‌ర్లు కూడా ఇందులో ఉన్నాయి.

ఈ ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.12,499 ఉండ‌గా, 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.14,999గా ఉంది. ఈ ఫోన్‌ను జూన్ 29 నుంచి కొనుగోలు చేయ‌వ‌చ్చు. మొద‌టి సేల్‌లో రూ.500 త‌గ్గింపు ల‌భిస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment