శృతిమించుతున్న వివాదం.. బండ్ల గ‌ణేష్‌ని తిట్టి పోస్తున్న ప‌వ‌న్ ఫ్యాన్స్..

February 5, 2023 5:57 PM

క‌మెడీయ‌న్ నుండి నిర్మాత‌గా మారిన బండ్ల గ‌ణేష్ కొద్ది రోజుల పాటు రాజ‌కీయాల‌లో ఉన్నారు. ఆ త‌ర్వాత రాజ‌కీయాల‌కు కూడా స్వ‌స్తి ప‌లికి ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో సంద‌డి చేస్తున్నారు. అయితే ప‌వ‌న్ భ‌క్తుడిగా చెప్పుకునే బండ్ల గ‌ణేష్ అప్పుడ‌ప్పుడు వివాదాస్ప‌ద కామెంట్స్ తో వార్త‌ల‌లో నిలుస్తూ ఉంటాడు. అయితే బండ్ల గణేష్ నేరుగానే పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయ‌డంతో ఫ్యాన్స రెచ్చిపోయారు. రీసెంట్‌గా పవన్ కళ్యాణ్ అన్ స్టాపబుల్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలయ్య గబ్బర్ సింగ్ మూవీ రెమ్యూనరేషన్ గురించి అడిగారు.

నిర్మాతగా ఉన్న బండ్ల గణేష్ రెమ్యూనరేషన్ ఎంత ఇచ్చాడని అడగ‌గా, దానికి పవన్ ”నేను అనుకున్నంత ఇవ్వలేదు తాను ఇవ్వాలనుకున్నంత ఇచ్చాడు” అని సమాధానం ఇచ్చాడు.. గబ్బర్ సింగ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా పవన్ మార్కెట్ ప్రకారం పూర్తి రెమ్యూనరేషన్ చెల్లించలేదని, ఈ కారణంతోనే పవన్ బండ్ల గణేష్ తో మూవీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదనే ప్రచారం తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో బండ్ల గణేష్ పై సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ ఎక్కువ‌య్యాయి.. ఓ నెటిజన్ బండ్ల గణేష్ కి మద్దతుగా ట్వీట్ వేశారు.

pawan kalyan fans very angry on bandla ganesh

నువ్వు ఆయన్ని దైవంలా భావిస్తావు. ప్రేమిస్తావు. ఆయనేమో ఒక పబ్లిక్ షోలో నీ పరువు తీసేశాడంటూ ట్వీట్ చేయ‌గా, దానికి బండ్ల గణేష్ ”నా విశ్వరూపం చూపిస్తా…” అని ఫైర్ ఎమోజీలు పోస్ట్ చేశారు. పవన్ చేసిన అవమానానికి ప్రతీకారం తీర్చుకుంట్లా అన్నట్లు ఆయన కామెంట్ చేయ‌డంతో ప‌వ‌న్ అభిమానులు రెచ్చిపోతూ బండ్ల గ‌ణేష్‌ని ఏకి పారేస్తున్నారు. కొన్నాళ్లుగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ బండ్ల గ‌ణేష్‌ని దూరం పెట్టిన‌ట్టు తెలుస్తుంది. భీమ్లా నాయ‌క్ ఆడియో ఫంక్ష‌న్ కి బండ్ల గ‌ణేష్‌కి ఆహ్వానం అందని కార‌ణంగా త్రివిక్ర‌మ్ పై దారుణ‌మైన కామెంట్స్ చేశారు. ఈ స‌మ‌యం నుండే ప‌వ‌న్ .. బండ్ల‌ని దూరం పెట్టి న‌ట్టు తెలుస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now