Pavithra Lokesh : న‌రేష్‌కి హ్యాండ్ ఇచ్చి మ‌రో వ్య‌క్తి ద‌గ్గ‌రికి ప‌విత్ర వెళ్లిందా..ఇందులో నిజమెంత‌..?

January 31, 2023 9:53 AM

Pavithra Lokesh : గ‌త కొద్ది కాలంగా న‌రేష్-ప‌విత్ర- రమ్య‌ల వ్య‌వ‌హారం ఎంత చ‌ర్చ‌నీయాంశంగా మారిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. నరేష్.. తన తోటి నటి పవిత్ర లోకేష్ ను త్వరలో పెళ్లి చేసుకోబోతున్న‌ట్టు ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చాయి. రమ్యా రఘుపతికి విడాకులు ఇచ్చి.. పవిత్ర లోకేష్ ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీనిపై ఈ మధ్యే నరేష్-పవిత్ర లోకేష్ ఓ వీడియో క్లిప్ ను విడుదల చేశారు. పవిత్ర లోకేష్ ను పెళ్లి చేసుకోవడాన్ని రమ్యా రఘుపతి గట్టిగా వ్యతిరేకిస్తోన్నారు. నరేష్ కు విడాకులు ఇవ్వడానికి అంగీకరించట్లేదు. ఇది కాస్త ఇద్దరి మధ్యా చిలికి చిలికి గాలీవానగా మారింది.

ఈ వివాదం రోజురోజుకి మ‌రింత పెరుగుతుండ‌డంతో వీరిద్దరు గొడవలు నాకెందుకని , వీటిని ఈ విధంగా ఎన్నాళ్లు భరించాలి అని ప‌విత్ర లోకేష్‌ బెంగళూరుకు వెళ్లి పోయినట్టు తెలుస్తోంది. న‌రేష్ రీసెంట్‌గా త‌న‌కు ప్రాణ హాని ఉంద‌ని, హ‌త్య‌కు కుట్ర జ‌రిగింద‌ని ప‌లు కామెంట్స్ చేశారు. ఈ ప‌రిస్థితుల‌న్నింటిని చూసి ప‌విత్ర లోకేష్ సైలెంట్ గా బెంగళూరు వెళ్ళిపోయిందని, ఇకనుంచి నరేష్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకుందని ప్రచారం అయితే జోరుగా న‌డుస్తుంది. మ‌రి ఇందులో ఎంత నిజం ఉంద‌నేది అనే దానిపై రానున్న రోజుల‌లో క్లారిటీ రానుంది.

Pavithra Lokesh reportedly broke up with naresh
Pavithra Lokesh

నరేష్‌కు ఇప్పటికే మూడు పెళ్లిళ్లు అయ్యాయి. పవిత్రకు కూడా ఇంత‌కు ముందే పెళ్లి అయింది. గతంలో నరేష్ పవిత్ర.. తమ రిలేషన్ పై బహిర్గంగానే కామెంట్ చేశారు. మేమిద్దరం కలిసి ఉంటున్నామని.. పెళ్లి చేసుకోలేదని.. తమని సపోర్ట్ చేయాలని.. చెప్పుకొచ్చారు. నరేష్, పవిత్ర లోకేష్‌ను మైసూరు హోటల్‌ గదిలో ఉండగా… నరేష్ మూడో భార్య రమ్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న విష‌యం తెలిసిందే.. ఆమె… వీరిద్దరిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వీడియోలో మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now