తంతే కారు వెన‌క్కి.. ఎందుకు వెళ్లిందంటే.. అస‌లు విష‌యం చెప్పిన వీర‌సింహారెడ్డి డైరెక్ట‌ర్‌..

January 23, 2023 10:25 AM

ఎన్నో ఏళ్లుగా ఫ్లాపుల‌ను ఎదుర్కొన్న నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ గ‌త కొంత కాలంగా జోరు మీదున్నారు. అఖండ ఇచ్చిన జోష్‌తో ఇంకో హిట్ కొట్టారు. వీర‌సింహారెడ్డిగా సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. ఈ క్ర‌మంలోనే సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ అయింది. తాజాగా వీర‌సింహారెడ్డి మూవీ స‌క్సెస్ సెల‌బ్రేష‌న్స్‌ను కూడా నిర్వ‌హించారు. ఇందులో న‌టించిన న‌టీన‌టులు సినిమా చేస్తున్న‌ప్పుడు త‌మ‌కు ఎదురైన అనుభ‌వాల‌ను వివ‌రించారు. ఇక వీర‌సింహారెడ్డితో బాల‌య్య క్రేజ్ మ‌రింత పెరిగింద‌ని చెప్ప‌వ‌చ్చు.

అఖండ ఇచ్చిన జోష్‌తో వీర‌సింహారెడ్డిన తెర‌కెక్కించారు. అంతే జోష్‌తో ఈ మూవీ కూడా హిట్ అయింది. ఇందులో బాల‌య్య న‌ట‌న అమోఘ‌మ‌నే చెప్పాలి. ముఖ్యంగా ఇందులో అధికార వైసీపీకి కౌంట‌ర్‌గా బాల‌య్య అనేక డైలాగ్స్ చెప్పారు. అయితే వైసీపీ వీటికి కౌంట‌ర్ వేయ‌న‌ప్ప‌టికీ థియేట‌ర్స్ లో మాత్రం ఈ డైలాగ్స్ బాగా పేలాయ‌నే చెప్ప‌వ‌చ్చు. ఇక ఈ మూవీలోని యాక్ష‌న్ స‌న్నివేశాలు కూడా ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. ముఖ్యంగా వీర‌సింహారెడ్డి వ‌చ్చిన సీన్ల‌లోని ఎలివేష‌న్స్ ప్రేక్ష‌కుల‌కు బాగా న‌చ్చాయి. అయితే ఈ మూవీలో అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించిన సీన్ ఒక‌టుంది. అదే కారును తంతే వెన‌క్కి వెళ్లే సీన్. ఈ సీన్ బాల‌య్య అభిమానుల‌కు న‌చ్చినా.. దీనిపై చాలా మంది ట్రోల్స్ చేశారు కూడా.

veerasimha reddy movie director explains how car goes backwards

మూవీలో ఉన్న ఈ సీన్‌లో కారును బాల‌య్య తంతే అది వెన‌క్కి వెళ్తుంది. అప్ప‌ట్లో వ‌చ్చిన ప‌ల‌నాటి బ్ర‌హ్మనాయుడులో ట్రెయిన్ కూడా ఇలాగే వెన‌క్కి వెళ్తుంది. దీంతో ఈ రెండు సీన్ల‌ను పోలుస్తూ నెటిజ‌న్లు ద‌ర్శ‌కుడు, న‌టుడిని ట్రోల్ చేస్తున్నారు. అయితే దీనిపై ద‌ర్శ‌కుడు గోపీచంద్ మ‌లినేని స్పందించారు. ఆయ‌న ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో దీనిపై వివ‌ర‌ణ ఇచ్చారు. ఆ సీన్‌లో విల‌న్లు కార్‌లో ఆల్రెడీ రివ‌ర్స్ గేర్ వేసి ఉంటారు. కానీ టైర్లు బుర‌ద‌లో ఇరుక్కుపోవ‌డం వ‌ల్ల కారు వెన‌క్కి వెళ్ల‌లేదు. ఇక అదే స‌మ‌యంలో బాల‌య్య కారును తంతాడు. దీంతో బుర‌ద‌లో ఉన్న టైర్లు బ‌య‌ట‌కు వ‌స్తాయి. అప్పుడు కారు ఎలాగూ రివ‌ర్స్ గేర్‌లో ఉంది క‌నుక వెనక్కి వెళ్తుంది. ఇదీ అస‌లు విష‌యం. ఇందులో ట్రోల్ చేయాల్సిన ప‌నిలేద‌ని గోపీచంద్ అన్నారు.

అయితే ద‌ర్శ‌కుడు వివ‌ర‌ణ ఇచ్చినా వాస్త‌వానికి అలా చేయ‌డం సాధ్యం కాదు. ఎందుకంటే అది ఆషామాషీ కార్ కాదు. బెంజ్ వి క్లాస్ కారు. అలాంటి కారును తంతే వెన‌క్కి వెళ్ల‌డం అన్న‌ది అసాధ్యం. క‌నుక‌నే నెటిజ‌న్లు ఈ విష‌యంపై ట్రోల్ చేస్తున్నారు. అయితే బాల‌య్య అభిమానులు మాత్రం వీటిని ప‌క్క‌న పెట్టి ఆ సీన్‌ను తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment