Parvati Melton : ఒక‌ప్పుడు అగ్ర హీరోల‌తో న‌టించిన పార్వ‌తి మెల్టన్‌.. ఇప్పుడు ఎలా ఉందో చూస్తే షాక‌వుతారు..

November 25, 2022 12:59 PM

Parvati Melton : దేవ కట్టా దర్శకత్వంలో తెరకెక్కిన వెన్నెల చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది పార్వతి మెల్టన్. ఆ చిత్రంలో ఈమె గ్లామర్ కు, క్యూట్ ఎక్స్ప్రెషన్లకు కుర్ర కారు ఫిదా అయిపోయారు. ఆ తరువాత పార్వతి మెల్టన్ గేమ్, అల్లరే అల్లరి, మధుమాసం వంటి చిత్రాల్లో కూడా నటించింది. అయితే ఈమెకు బ్రేక్ ఇచ్చింది మాత్రం పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన జల్సా చిత్రమే అని చెప్పాలి. ఆ తరువాత మహేష్ బాబు, శ్రీను వైట్ల కాంబినేషన్లో తెరకెక్కిన దూకుడు చిత్రంలో కూడా స్పెషల్ సాంగ్ లో కనిపించి ప్రేక్షకులను తన గ్రామర్ తో ఆకట్టుకుంది.

అందం, అభినయం ఉన్న‌ పార్వ‌తి మెల్ట‌న్ ను గ్లామ‌ర్ లుక్ లోనే ప్రేక్షుకులు ఇష్ట‌ప‌డేవారు. ఎంత క్రేజ్ వున్నా తెలుగు సినిమాల్లో హీరోయిన్ స్థాయిలో అవకాశాలు దక్కలేదు అని చెప్పవచ్చు. మ‌ళ‌యాళంలో మోహ‌న్ లాల్ హీరోగా నటించిన హ‌ల్లో చిత్రంలో న‌టించి అల‌రించింది. ఈ సినిమా మళ‌యాళంలో బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. చివ‌ర‌గా 2012లో ఈ బ్యూటీ య‌మ‌హో య‌మ అనే సినిమాలో క‌నిపించి ఆ త‌రువాత సినిమాల‌కు దూరం అయ్యింది.

Parvati Melton star heroine once see how she changed now
Parvati Melton

ఇక పార్వతి మెల్టన్ ఎవరనే విషయంలోకి వెళ్తే,ఈమె పుట్టి పెరిగిందంతా అమెరికాలోనే. న్యూజెర్సీలో జర్మనీ దేశానికి చెందిన శ్యాం మెల్టన్, ఇండియన్ పంజాబీ దార్ ప్రీత్ కి పుట్టింది పార్వతి మెల్టన్. ఈమెకి ఓ చెల్లెలు కూడా ఉంది. ఆమె పేరు హరియాణా సితారా మెల్టన్. ఇక పార్వతి మెల్టన్ కి చిన్ననాటినుంచి డాన్స్ అంటే ఎంతో మక్కువ. కాలిఫోర్నియాలో డిగ్రీ చదివే సమయంలో భరతనాట్యం నేర్చుకున్న పార్వతి మెల్టన్, వివిధ స్టేజ్లపై ప్రదర్శనలు కూడా ఇచ్చింది. వెన్నెల చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది పార్వతి. ఇక సినిమా అవకాశాలు తగ్గడంతో 2013లో అమెరికాలో యువ పారిశ్రామికవేత్త శ్యాం సులాల్ ని వివాహం చేసుకుంది. ప్రస్తుతం పార్వతి న్యూజెర్సీలో సెటిల్ అయింది. ఈ జంటకు ఒక బాబు కూడా ఉన్నాడు. ప్ర‌స్తుతం భ‌ర్త‌తో క‌లిసి ఈ ముద్దుగుమ్మ వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ జీవ‌నం సాగిస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now