Koratala Siva : కొరటాల శివ భార్య ఎవరు ? ఆమె ఏమి చేస్తుందో తెలిస్తే మాత్రం కచ్చితంగా హ్యాట్సాఫ్ అంటారు..

November 20, 2022 1:53 PM

Koratala Siva : రచయితగా కెరీర్ ని ఆరంభించి డైరెక్షన్ విభాగంలో అడుగుపెట్టిన దర్శకులలో కొరటాల శివ కూడా ఒకరు. వరుస సక్సెస్ లతో  టాలీవుడ్ లో మోస్ట్ టాలెంటెడ్ దర్శకునిగా పేరుతెచ్చుకున్నారు. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజీ,  భరత్ అను నేను చిత్రాలతో  అపజయం ఎరుగని దర్శకుడిగా  ప్రేక్షకులలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒక సినిమాకి  మంచి కథే సక్సెస్ కి కారణమని నమ్మే కొరటాల, రచయితల కన్న కూడా డైరెక్టర్లెకు ఎక్కువ గుర్తింపు ఉంటుందని నమ్మి దర్శకుడిగా మిర్చి చిత్రం ద్వారా తన ప్రతిభను చాటుకున్నారు.

ఆయన ఇంత సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకోవడానికి, ఆయన సక్సెస్ వెనక కారణం తన భార్య అని చాలా సందర్భాల్లో కొరటాల శివ చెప్పుకొచ్చారు. అవును ప్రతి పురుషుని వెనుకా, ఓ స్త్రీ ఉంటుంది కదా. అలాగే కొరటాల శివ వెనుక ఉన్న స్త్రీ మూర్తి ఆయన భార్య అరవింద. ఆమె చాలా సింపుల్  వుంటారు. అరవింద లండన్ లో ఉన్నత విద్య చదువుకున్నారు.

Koratala Siva wife aravinda do you know these facts about her
Koratala Siva

కొరటాల శివలో ఉన్న నిజాయితీ ఆమెను కట్టి పడేయడంతో ఇద్దరి పరిచయం ప్రేమగా మారి వివాహం బంధంతో  ఒకటయ్యారు. కానీ అనన్ని సమకూర్చిన ఆ దేవుడు ఈ జంటకు సంతాన ప్రాప్తి  ఇవ్వలేదు. అయితే సమాజంలో గల చిన్నవాళ్లంతా తమ పిల్లలనే భావన గల ఆమె అదే దిశగా కొరటాలను కూడా  ప్రోత్సహించింది. ఇద్దరు బతకాలంటే తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు ఉంటే సరిపోతుందని అరవింద ఎక్కువగా భావిస్తారట

ఇక ఆమె మొదటి నుంచి రామకృష్ణ పరమహంస భక్తురాలు కావటంతో రామకృష్ణుని బోధనలతో విశేషంగా ప్రభావితం అయింది. ప్రతి ఆదివారం ఆమె రామకృష్ణ మఠానికి వెళ్లి సేవలు అందిస్తుంది. ఇక శ్రీమంతుడు కాన్సెప్ట్ ఆమె ఫిలాసఫీ నుంచి వచ్చిందేనట. అందుకే కోట్లు సంపాదించినా నేటికీ చిన్న అపార్ట్ మెంట్ లోనే ఉంటున్నారు ఈ దంపతులు.

ఎంత సంపాదించినా అవసరానికి మించి ఉండకూడదని, తినడానికి, బతకడానికి అవసరమైనది ఉంచుకుని మిగిలింది తిరిగి సమాజానికి తిరిగి ఇచ్చేయాలనే సిద్ధాంతం ఆమె ఫాలో అవుతారు. అందుకే సంపాదనలో అధికభాగం సమాజ సేవకే వినియోగిస్తూ ఆత్మతృప్తి పొందుతున్నారట అరవింద.  డైరెక్టర్ లైఫ్ కన్నా ఓ మంచి వ్యక్తికి భర్తగా జీవితం చాలా బావుంటుందని కొరటాల  చాలా  సందర్భాల్లో భార్య అరవిందా గురించి చెప్పటం విశేషం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now