Namrata Shirodkar : మహేష్ బాబు భార్య నమ్రత ఓ స్టార్ క్రికెటర్ కూతురని మీకు తెలుసా..?

November 17, 2022 12:11 PM

Namrata Shirodkar : నమ్రత శిరోద్కర్ మాజీ మిస్ ఇండియా, ప్రముఖ మోడల్, బాలీవుడ్ నటి అని ఇలా చెబితే తెలుగు వారికి కాస్త కొత్తగా అనిపిస్తుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు భార్యగా నమ్రత అందరికీ సుపరిచితమే. వంశీ సినిమాతో మహేష్ బాబు నమ్రత మధ్య ఏర్పడిన పరిచయం వారి పెళ్లి వరకు నడిపించింది. అప్పుడే కెరీర్ ప్రారంభించిన మహేష్ బాబు వంశీ సినిమా హీరోయిన్ నమ్రత ప్రేమలో పడి వివాహ బంధంతో ఒకటయ్యారు.

ఇక నమ్రత వ్యక్తిగత జీవిత విషయానికి వెళ్తే.. ఈమె మహారాష్ట్రలో పుట్టి పెరిగింది. నమ్రత 1972 జనవరి 22 న ముంబై లో జన్మించింది. ఆమె తండ్రి నితిన్ శిరోద్కర్. అప్పట్లో ఆయన క్రికెటర్. ఆయన పూర్తీ పేరు నితిన్ పాండురంగ శిరోద్కర్. ముంబైకి ఆడే దేశవాళీ క్రికెట్ లో ఎంతో పేరు తెచ్చుకున్నారు. సునీల్ గవాస్కర్, దిలీప్ వెంగసర్కార్ వంటి స్టార్ ఆటగాళ్లతో నితిన్ శిరోద్కర్ ఆడేవారట. నితిన్ టోర్నమెంట్స్ ఆడేటప్పుడు అదే పనిగా టెలిగ్రామ్స్ వచ్చేవట. దాంతో తోటి ఆటగాళ్లు ఆశ్చర్యపోయేవారు.

Namrata Shirodkar interesting facts to know
Namrata Shirodkar

అయితే నితిన్ ఆ టెలిగ్రామ్స్ ని పెద్దగా పెట్టించుకొనేవాడు కాదు. కొత్తగా పెళ్ళైన నితిన్ కి తన భార్య వనిత నుండి ఆ టెలిగ్రామ్స్ వచ్చేవట. దాంతో అందరు ఆయనను ఆటపట్టించేవారు. నితిన్ తన కెరీర్ లో మంచి ఫాస్ట్ బౌలర్ గా ఎదిగారు. అద్భుతమైన బౌలర్ గా అప్పటిలో చెప్పుకొనేవారు. ఇక నమ్రత తల్లి విషయానికి వస్తే ఆమె అప్పటిలో పెద్ద మోడల్. నమ్రత అమ్మమ్మ మీనాక్షి శిరోద్కర్ మరాఠీ నటిగా ఎంతో పేరు తెచ్చుకున్నారు.

ఒక రకంగా సెలబ్రెటీ కుటుంబం నుండి వచ్చిన నమ్రత మొదట్లో మోడలింగ్ రంగంలో గుర్తింపు తెచ్చుకుంది. 1993 లో మిస్ ఇండియాగా కిరీటాన్ని దక్కించుకొని మిస్ యూనివర్స్ పోటీలకు సెలట్ అయ్యింది. అయితే నమ్రత మిస్ యూనివర్స్ గా 5 వ స్థానంతో సరిపెట్టుకుంది. ఇక అప్పటి నుండి సినిమా అవకాశాలు క్యూ కట్టాయి. నమ్రత 1998 లో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. 2000లో వంశీ చిత్రంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now