MCA Movie Vijay Varma : ఎంసీఏ చిత్రంలో విలన్ గా నటించిన విజయ్ వర్మ గురించి ఈ ఆసక్తికరమైన విషయాలు తెలుసా..?

November 12, 2022 7:25 PM

MCA Movie Vijay Varma : నాచురల్ స్టార్ గా తిరిగిలేని ఇమేజ్ ని సంపాదించుకున్నాడు నాని. వైవిధ్యమైన కథల కంటే తన ఇమేజ్ కు తగ్గట్టు పాత్రతోనే ఎక్కువగా ఫేమస్ అయ్యాడు. ఈ తరం హీరోలలో సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ హీరోగా ఎదిగిన వారు ఎవరు అంటే అది నానినే అని చెపుతారు.  నాని నటించే సినిమాల్లో దాదాపుగా అన్ని పాత్రలకు మంచి ప్రాముఖ్యత ఉంటుంది. నాని తన పాత్రతో పాటు మిగతా పాత్రలు కూడా బలంగా ఉంటే సినిమా సక్సెస్ అవుతుందని నమ్ముతారు. అదే సక్సెస్ ఫార్ములా ను ఫాలో అవుతూ  ముందుకు సాగుతున్నాడు నాని. అందుకే తన నటించే సినిమాల్లో ప్రతి పాత్ర విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు నాని.

2017లో నాని, సాయి పల్లవి హీరోహీరోయిన్స్ గా,  భూమిక ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ఎంసీఏ(MCA). ఈ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో మనకు తెలిసిన విషయమే. ఎంసీఏ సినిమాలో విలన్ గా విజయ్ వర్మ నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. ఎంసీఏ సినిమా సక్సెస్ లో విజయ్ వర్మకు కూడా భాగం ఉందని చెప్పవచ్చు. ఎంసీఏ సినిమా విడుదల అయినా సమయంలో విజయ్ వర్మ నటనతో అదరకొట్టాడనే వార్తలు జోరుగా విన్పించాయి.

MCA Movie Vijay Varma interesting facts
MCA Movie Vijay Varma

దాంతో అసలు ఈ విజయ్ వర్మ ఎవరనే వెతుకులాట మొదలయ్యాయి. ఒక మార్వాడి కుటుంబంలో జన్మించిన విజయ్ వర్మ హైదరాబాద్ లోనే పెరిగాడు. పూణే ఇన్స్టిట్యూట్ లో నటనకు సంబంధించి కోర్స్ పూర్తి చేశాడు. ఆ తర్వాత ముంబైలో సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేసాడు. విజయ్ వర్మకు సినిమాల్లో నటించాలనే బలమైన కోరిక ఉండటంతో ఒక డ్రామా కంపెనీలో చేరి నాటకాలు వేయటం ప్రారంభించాడు. అయితే విజయ్ వర్మ సినిమాల్లోకి రావటం ఇంటిలోవారికి ఇష్టం లేదట. దాంతో చాలా కాలం వరకు విజయ్ తో వారి కుటుంబసభ్యులు మాట్లాడలేదట.

ఎంసీఏ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌లుక‌రించిన విజ‌య్ వ‌ర్మ బాలీవుడ్ లో  పింక్, గ‌ల్లీ బాయ్‌, సూప‌ర్ 30 లాంటి భారీ ప్రాజెక్టులో నటించి సక్సెస్ ని అందుకున్నాడు. ఎంసీఏ తరువాత విజ‌య్ వ‌ర్మ మ‌రే తెలుగు సినిమాలో క‌నిపించ‌లేదు. బాలీవుడ్ లో చేసిన సినిమాలు హిట్ కావటంతో విజయ్ వర్మ గురించి ఎంసీఏ నిర్మాతలకు తెలిసింది. దాంతో వెంటనే ఎంసీఏ నిర్మాతలు విలన్ గా విజయ్ వర్మను ఫిక్స్ చేసేసారు. సినిమాలో విజయ్ నానితో పోటాపోటీగా నటించి ప్రేక్షకులను మెప్పించాడు. విజయ్ నటనకు టాలీవుడ్ ప్రముఖులు సైతం ఫిదా అయ్యిపోయారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now