Jr NTR : జూనియ‌ర్ ఎన్టీఆర్‌, వ‌డ్డే న‌వీన్.. బావ, బావ‌మ‌రుదులా.. ఇన్ని రోజులు ఈ విషయం ఎవరికీ తెలిసుండదు..!

అక్టోబర్ 18, 2022 8:11 ఉద.

Jr NTR : కోరుకున్న ప్రియుడు సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు వడ్డే నవీన్. నిర్మాత వడ్డే రమేష్ వారసుడిగా తెరంగ్రేటం చేసిన ఆయన హీరోగా అనేక సినిమాల్లో నటించాడు. అయితే ఆయనకు బ్రేక్ ఇచ్చిన సినిమా మాత్రం పెళ్లి. ఆ తర్వాత మనసిచ్చి చూడు, మా బాలాజీ, ప్రేమించే మనసు, చాలా బాగుంది సినిమాలతో హిట్లు అందుకుని తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. అయితే నవీన్ కెరీర్లో ఎంత వేగంగా ఎదిగాడో అంతకంటే వేగంగా డౌన్ అయిపోయాడు.

సుమారు పాతిక సినిమాల్లో హీరోగా నటించిన ఆయన అవకాశాలు తగ్గిపోవడంతో 2, 3 సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించాడు. అవికూడా ఫ్లాప్ అవడంతో ఆయన్ని ఎవరు పట్టించుకోలేదు. ప్ర‌స్తుతం న‌వీన్ ఇండ‌స్ట్రీకి దూరంగా ఉన్నాడు. ఇదిలా ఉండ‌గా.. వ‌డ్డే న‌వీన్ నంద‌మూరి కుటుంబానికి అల్లుడు అన్న సంగ‌తి చాలామందికి తెలియ‌దు. ఎన్టీఆర్ కొడుకుల‌లో ఒక‌రైన నంద‌మూరి రామకృష్ణ కూతురును వ‌డ్డే న‌వీన్ పెళ్లి చేసుకున్నాడు. ఆ సంబంధాన్ని కూడా ఎన్టీఆర్ సెట్ చేశార‌ట‌.

Jr NTR and Vadde Naveen are in laws do you know that
Jr NTR

జూనియర్ ఎన్టీఆర్ కు వ‌డ్డే న‌వీన్ మంచి స్నేహితుడ‌ని అప్ప‌ట్లో టాక్ న‌డిచేది. పెళ్లికి ముందే వ‌డ్డే న‌వీన్ రామ‌కృష్ణ కూతురుతో ప్రేమ‌లో ఉండేవాడ‌ట‌. ఎన్టీఆర్ వ‌ల్ల ఈ పెళ్లి జ‌రిగింద‌ని స‌మాచారం. అయితే ఆ త‌రువాత ఏమి జ‌రిగిందో కానీ వ‌డ్డే న‌వీన్ విడాకులు ఇచ్చి వేరొక పెళ్లి చేసుకున్నాడు. నంద‌మూరి కుటుంబంతో బంధుత్వం తెంచుకున్నాడు. కానీ నంద‌మూరి హీరో ఎన్టీఆర్‌తో మాత్రం న‌వీన్ స‌న్నిహితంగా ఉన్నాడంట. ఈ విష‌యం అతి కొద్దిమందికి మాత్ర‌మే తెలుసు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment