రుచికరమైన మ్యాంగో కుల్ఫీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసా ?

June 23, 2021 1:10 PM

వేసవికాలం వచ్చిందంటే మనకు మామిడిపండ్ల సీజన్ మొదలవుతుంది ఈ క్రమంలోనే మామిడిపండు తో వివిధ రకాల రెసిపీలను తయారు చేసుకొని తింటారు. ముఖ్యంగా పిల్లలు ఎంతో ఇష్టపడే మ్యాంగో కుల్ఫీ ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు

*పాలు అర కప్పు

*మామిడిపండు గుజ్జు ఒక కప్పు

*కండెన్స్‌డ్‌ మిల్క్‌ పావు కప్పు

*పంచదార 3 టేబుల్ స్పూన్లు

*కోవా 50 గ్రాములు

తయారీ విధానం

ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి పాలను బాగా మరిగించాలి. పాలు బాగా మరిగిన తరువాత దీనిలోకి
కండెన్స్‌డ్‌ మిల్క్‌, పంచదార వేసి బాగా కలియబెట్టాలి. ఈ మిశ్రమంలోకి కోవా వేసి చిన్న మంటపై ఉడికించాలి. ఈ విధంగా ఈ మిశ్రమం మొత్తం ఐదు నిమిషాల పాటు బాగా ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి ఆ మిశ్రమంలోకి మామిడి పండు గుజ్జును వేసి మెత్తగా బ్లెండ్ చేయాలి. ఈ విధంగా బ్లెండ్ చేసిన మిశ్రమాన్ని కుల్ఫీ మౌల్డ్‌లో పోసుకోవాలి. 6 నుంచి 8 గంటలపాటు డీప్‌ ఫ్రిజ్‌లో ఉంచుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మ్యాంగో కుల్ఫీ రుచిని ఆస్వాదించవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment