దారుణం.. కూతురికి పట్టిన దెయ్యం వదిలించాలని.. తీవ్రంగా హింసించి మంటల్లో కాల్చేశాడు..

October 13, 2022 10:00 PM

కుమార్తెకు దెయ్యం పట్టిందని.. దాన్ని వదిలించాలని చెప్పి ఓ తండ్రి దారుణమైన ఘాతుకానికి పాల్పడ్డాడు. సమాజం సిగ్గుతో తలదించుకునేలా ప్రవర్తించాడు. తన సోదరుడితో కలిసి తన కుమార్తెను అత్యంత కఠినంగా హింసించి చివరకు మంటల్లో వేసి కాల్చేశారు. ఈ ఘటన గుజరాత్‌లో చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

సూరత్‌కు చెందిన భవేష్‌ అక్బరి అనే వ్యక్తి ఆరు నెలల కిందట అక్కడి గిర్‌ సోమనాథ్‌ జిల్లాలోని ధావా అనే గ్రామానికి వచ్చి అక్కడే నివాసం ఉండసాగాడు. అతనితో కలిసి అతని సోదరుడు దిలీప్‌ కూడా నివసించేవాడు. అయితే తన 14 ఏళ్ల కుమార్తెకు దెయ్యం పట్టిందని భావిస్తూ.. భవేష్‌ అక్కడికి సమీపంలోని చక్లిధర్‌ అనే ప్రాంతానికి సోదరుడితో కలిసి వెళ్లాడు. వెంట కుమార్తెను తీసుకెళ్లారు. అక్కడ వారు అత్యంత రాక్షసంగా ప్రవర్తించారు.

man killed his 14 year old daughter

ఆ బాలికను వారు ముందుగా కట్టేసి దుస్తులకు నిప్పు పెట్టి కాల్చేశారు. తరువాత ఆమెను తీవ్రంగా హింసించారు. అనంతరం ఆమెను మంటల్లో వేసి కాల్చేశారు. అయితే నిందితులు ఆనవాళ్లు లభించకుండా చేశారు. దీని వల్ల ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అయితే స్థానికులు చెప్పిన ప్రకారం భవేష్‌ ఎల్లప్పుడూ ఒంటరిగా ఏదో ఆలోచిస్తూ ఉంటాడని, ఏపని చేయడని వెల్లడైంది. ఈ క్రమంలోనే పోలీసులు నిందితులు ఇద్దరినీ అరెస్టు చేసి జైలుకు తరలించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment