Nayanthara : నయన్‌కి పిల్లలు కూడా పుట్టారు.. నెట్ ఫ్లిక్స్ మీ వీడియో ఎక్కడా..!?

October 13, 2022 11:02 AM

Nayanthara : నయనతార తల్లైన వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మలయాళ సినీ పరిశ్రమ ద్వారా హీరోయిన్ గా మారిన నయనతార తర్వాత దక్షిణాదిలోని టాప్ హీరోయిన్ అనిపించుకుంది. అయితే తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్ తో ప్రేమలో పడి కొన్నాళ్ల పాటు డేటింగ్ చేసిన ఈ భామ ఈ ఏడాది జూన్ నెలలో మహాబలేశ్వరంలో విగ్నేష్ శివన్ తో ఏడడుగులు వేసింది. సెలబ్రెటీల పెళ్లి ఒక సెన్సేషన్ అయితే వాళ్లకి పుట్టే పిల్లలను కూడా సెన్సేషన్ చేస్తున్నారు నెటిజన్లు. అయితే ఇప్పుడు ఈ సెన్సేషన్ కి గురైన జంట నయనతార విఘ్నేష్ శివన్.

ప్రస్తుతం వారికి పుట్టిన కవలలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచారు. దానికి కారణం వారు సరోగసి ద్వారా పిల్లలను కనడమే అని మనందరికీ తెలిసిందే. అంతేకాక వారికి పెళ్లి జరిగి కేవలం 5 నెలలు మాత్రమే కావడం ఈ వార్త మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ వార్తతో పాటు కొంతమంది నెటిజన్లు మరొక వార్తను కూడా వైరల్ చేస్తున్నారు. అదేమిటంటే నయనతార విఘ్నేష్ శివన్ ల వివాహం జరిగినప్పుడు, ఆ వేడుకను డైరెక్టర్ గౌతమ్ మీనన్ చేత నెట్ ఫ్లిక్స్ షూట్ చేయించిందని, దానిని తొందరలోనే నెట్ ఫ్లిక్స్ తన ఛానల్లో స్ట్రీమింగ్ చేయనుందని అప్పట్లో ఓ వార్త ప్రముఖంగా వినిపించింది.

Nayanthara
Nayanthara

కానీ వారి వివాహం జరిగి కొన్ని నెలలు గడిచినప్పటికీ ఇంకా నెట్ ఫ్లిక్స్ ఆ వివాహ వేడుకకు సంబంధించిన ఎలాంటి వీడియోను రిలీజ్ చేయలేదు. కాబట్టి నయన్ అభిమానులు నెట్ ఫ్లిక్స్ ను నయన్ కి కవలలు కూడా జన్మించారు. మీరు మాత్రం పెళ్లి వీడియోను ఎప్పుడు టెలికాస్ట్ చేస్తారు..? అంటూ సరదాగా అడుగుతున్నారు. నయన్ పిల్లల విషయంతో పాటు ఈ విషయం కూడా ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. చూద్దాం నెట్ ఫ్లిక్స్ ఇకనైనా నయన్ పెళ్లి వీడియోకి సంబంధించి ఎలాంటి సమాచారం ఇస్తుందో..!

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now