ఫోటోగ్రాఫర్ కావాలనుకుంటున్న‌ వెబ్ స్టార్.. ఎవరంటే ?

June 22, 2021 10:28 AM

రుచా ఇనామ్‌దార్‌ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒక మోడల్ గా, కళాకారిణిగా, థియేటర్ ఆర్టిస్టుగా పరిచయమైన రుచా ప్రస్తుతం వెబ్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకుంది. కెరియర్ పరంగా డాక్టర్ కోర్సు పూర్తి చేసినప్పటికీ చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ఎంతో ఎక్కువ ఇష్టం ఉండటంతో కథక్, లాటిన్‌ అమెరికన్‌ జానపద నృత్యాల్లో శిక్షణ తీసుకుంది.

బాలీవుడ్ స్టార్ హీరోల సరసన సుమారు 60కి పైగా వాణిజ్య ప్రకటనలలో కనిపించారు. 2014వ సంవత్సరంలో ‘చిల్డ్రన్‌ ఆఫ్‌ వార్‌ ’ అనే సినిమా ద్వారా వెండితెరపై అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తరువాత వరుసగా  ‘అండర్‌ ది సేమ్‌ సన్‌’, ‘భక్తి’, ‘భిఖారీ’, ‘ వెడ్డింగ్‌ చా షినేమా’ సినిమాల్లోనూ నటించారు.

ప్రస్తుతం హాట్‌స్టార్‌లో ప్రసారమవుతోన్న ‘క్రిమినల్‌ జస్టిస్‌’తో వెబ్‌ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఈ సిరీస్ లో ఆమే నటనకు బెస్ట్‌ పాపులర్‌ యాక్టర్‌ ఇన్‌ సపోర్టింగ్‌ రోల్‌’ అవార్డునూ అందుకుంది.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చాలా మంది తమకు ఏదైనా ఖాళీ సమయం దొరికితే అది చేయాలి ఇది చేయాలి అని భావిస్తుంటారు. అదేవిధంగా మరికొందరు తమ శరీర ఫిట్ నెస్ పై దృష్టి సారిస్తారు. కానీ ఈ ముద్దుగుమ్మ మాత్రం సెమీ ఫోటోగ్రఫీ ఆన్లైన్ కోర్సు పూర్తి చేసినట్లు తెలిపారు. త్వరలోనే ఒక పెద్ద ఫోటోగ్రాఫర్ కావాలనుకుంటున్నట్లు ఈ సందర్భంగా నటి రుచా ఇనామ్‌దార్‌ తెలిపారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment