Pawan Kalyan : త‌న‌లో ఉన్న లోపం అదేన‌ని చెప్పిన ప‌వ‌న్‌.. అంద‌రికీ షాకిచ్చారు..!

October 9, 2022 9:34 AM

Pawan Kalyan : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ గురించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈయ‌న చిరంజీవి త‌మ్ముడిగా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన‌ప్ప‌టికీ ఆ త‌రువాత త‌న సొంత శ్ర‌మ‌, క‌ష్టంతో ఒక్కో మెట్టు ఎదిగారు. ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా సొంత టాలెంట్‌, ల‌క్ లేక‌పోతే సినిమా ఇండ‌స్ట్రీలో ఎవ‌రూ రాణించ‌లేరు. ప‌వ‌న్ టాలెంట్‌తోనే బాగా ఎదిగార‌ని చెప్ప‌వ‌చ్చు. ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌స్తుతం ఓ వైపు సినిమాల‌తో బిజీగా ఉంటూనే.. మ‌రోవైపు రాజ‌కీయాల్లోనూ యాక్టివ్‌గా ఉన్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ప్ర‌స్తుతం ఏపీలో ఎన్నిక‌ల కోసం సిద్ధ‌మ‌వుతున్నారు. అలాగే హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు షూటింగ్‌లో పాల్గొన‌నున్నారు.

ఇక ఎంత గొప్ప వ్య‌క్తి అయినా స‌రే కొన్ని బ‌ల‌హీన‌త‌లు, లోపాలు ఉంటాయి. ప‌వ‌న్ కు కూడా అలాంటివి ఉన్నాయి. ప‌వ‌న్‌కు ఎలాంటి బ‌ల‌హీన‌త లేదు. కానీ ఒక్క లోపం మాత్రం ఉంద‌ట‌. దాని వ‌ల్ల‌నే ఆయ‌న చాలా ఇబ్బందులు ప‌డుతున్నార‌ట‌. ఈ విష‌యాన్నే ఆయ‌నే స్వ‌యంగా చెప్పారు. అప్ప‌ట్లో ఓ సినిమాకు చెందిన ప్రీ రిలీజ్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ప‌వ‌న్ త‌న‌కు ఒక లోపం ఉంద‌ని చెప్పి అంద‌రికీ షాకిచ్చారు. అదేమిటంటే.. త‌న‌కు ఉన్న లోపం సిగ్గు అని చెప్పారు. త‌న‌కు బాగా సిగ్గ‌ని.. అందుక‌నే కొన్నిసార్లు ఎవరినైనా అడగాల‌నుకుంది అడ‌గ‌లేక‌పోతాన‌ని చెప్పారు.

Pawan Kalyan told his weakness
Pawan Kalyan

సిగ్గు వ‌ల్ల సినిమాల్లో న‌టించ‌డం కూడా ఇబ్బందిగానే ఉంటుంద‌ని ప‌వ‌న్ తెలిపారు. అయితే ప‌వ‌న్ అప్ప‌ట్లో చేసిన కామెంట్స్ ఇప్పుడు మ‌ళ్లీ వైర‌ల్ అవుతున్నాయి. ఇక ప‌వ‌న్ హ‌రిహ‌ర వీర‌మ‌ల్లుతోపాటు వినోద‌య సీత‌మ్‌లో చేయ‌నున్నారు. ఆ త‌రువాత పూర్తి స‌మ‌యాన్ని రాజ‌కీయాల కోస‌మే కేటాయించ‌నున్నారు. ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్ వ‌చ్చే ఏడాదిలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బ‌స్సు యాత్ర చేయ‌నున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment