Chiranjeevi : చిరంజీవి వ‌ర్సెస్‌ గరికపాటి వివాదం.. అస‌లు అక్క‌డ జ‌రిగింది ఏమిటి.. అంద‌రూ ప‌ప్పులో కాలేశారా..?

October 8, 2022 4:08 PM

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి ఆధ్యాత్మిక ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలపై సోషల్‌ మీడియాలో దుమారమే రేగింది. హైదరాబాద్‌లో బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో నిర్వహించిన అలయ్‌ బలయ్‌ కార్యక్రమంలో చిరంజీవి ఫోటో సెషన్‌ ఆపేసి రాకపోతే నేనే వెళ్లిపోతా అని అసహనం వ్యక్తం చేశారనే అంశం వివాదానానికి దారి తీసింది. దీంతో మొన్నటి నుంచి సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో రచ్చ జరుగుతుంది. అయితే అక్కడ ఆ సంఘటన జరిగిన తర్వాత ఏం జరిగింది అనేది ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. గరికపాటి అన్న మాటలను సెపరేట్ చేసి.. చిరంజీవి అన్న మాటలను వేరు చేసి వీడియోను వైరల్ చేస్తున్నారు.

అదే నిజమని అంతా అనుకున్నారు.. అస్సలు ఆ తరువాత గరికపాటి చిరంజీవికి ఎంత గౌరవం ఇచ్చారు అనేది కూడా చూడాలి.. అసలు ఆ తర్వాత ఏం జరిగింది అనే విషయాన్ని అక్కడే ఉన్న ఓ జర్నలిస్ట్ ట్వీట్ చేశాడు. మొన్నటి అలయ్ – బలయ్ కార్యక్రమంలో వాస్తవానికి చిరంజీవి తప్పు ఏమీ లేదు.. ఆ కార్యక్రమం నిర్వహిస్తున్న బండారు దత్తాత్రేయ కుటుంబ సభ్యులు చిరంజీవితో ఫోటో దిగడానికి మెగాస్టార్ ను వేదికకు ఒక పక్కకు పిలిచారు. దత్తాత్రేయ కుటుంబ సభ్యులు గ్రూపులుగా వచ్చి ఫోటో దిగుతున్నారు.. ఈలోపు సభ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న చింతల రామచంద్రారెడ్డి గరికపాటి నరసింహారావును మాట్లాడవలసిందిగా కోరారు.

Chiranjeevi and Garikapati controversy what really happened there
Chiranjeevi

ఇది ఫోటోలు దిగుతున్న చిరంజీవికి వినిపించలేదు. చిరంజీవి ఫోటోలు దిగుతుంది దత్తాత్రేయ కుటుంబ సభ్యులతో అని గరికపాటికి తెలియక అభిమానులతో ఫోటో దిగుతున్నారని ఆయన చిరాకు ప్రదర్శించారు. గరికపాటికి ఇది తెలిసి చిరంజీవి వద్దకు వచ్చి ఏదో చెప్పారు.. ఆ తర్వాత తన పక్కన కూర్చోవాల్సిందిగా గరికపాటి చిరంజీవిని కోరారు. వెంటనే చిరంజీవి కుర్చీ తెప్పించుకొని ఆయన పక్కనే కూర్చున్నారు. ఇదే వేదికపై జరిగిన అసలు కథ. ఆ తరువాత గరికపాటి, చిరంజీవి చాలా సన్నిహితంగా ఉన్నారని.. ఆ ఫంక్షన్ అయ్యాక‌ ఇద్దరూ కలిసి కాసేపు పర్సనల్ గా మాట్లాడుకున్నారని.. ఆ జర్నలిస్ట్ తన ట్వీట్ లో రాసుకొచ్చాడు. అయితే వివాదం ఇంత‌టితో ముగుస్తుందా.. లేదా.. అన్న‌ది చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now