ఏపీలో నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. జాబ్ క్యాలెండ‌ర్‌ను విడుద‌ల చేసిన సీఎం జ‌గ‌న్‌..

June 18, 2021 10:41 PM

ఏపీలో ఉన్న నిరుద్యోగుల‌కు ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం శుభ‌వార్త చెప్పింది. 2021-22 సంవ‌త్స‌రానికి జాబ్ క్యాలెండర్‌ను విడుద‌ల చేసింది. ఈ మేర‌కు సీఎం జ‌గ‌న్ జాబ్ మార్చి 2022 వ‌ర‌కు జాబ్ క్యాలెండ‌ర్‌ను ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవ‌త్స‌రంలో మార్చి 2022 వ‌ర‌కు మొత్తం 10,143 ఉద్యోగాల‌ను భర్తీ చేస్తామ‌ని తెలిపారు.

good news to unemployed in ap job calendar launched by cm ys jagan

ద‌ళారులు, సిఫార‌సులు, పైర‌వీలు లేకుండా కేవ‌లం మెరిట్ ఆధారంగానే పోస్టుల భ‌ర్తీ ప్ర‌క్రియ‌ను చేప‌డుతామ‌ని సీఎం జ‌గ‌న్ తెలిపారు. ఉద్యోగాల కోసం ఎంతో మంది అభ్య‌ర్థులు ఎదురు చూస్తున్నార‌ని, ఎన్నో ఏళ్లుగా శిక్ష‌ణ తీసుకుంటున్నార‌ని అన్నారు. వారు మనో ధైర్యం కోల్పోకుండా ఉండేందుకే ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేస్తున్న‌ట్లు తెలిపారు.

ఈ క్యాలెండ‌ర్ ద్వారా ఏ ఉద్యోగాల‌కు భ‌ర్తీ ప్ర‌క్రియ ఏ నెల‌లో వ‌స్తుందో సుల‌భంగా తెలుసుకోవ‌చ్చ‌న్నారు. 2 ఏళ్ల‌లో 6,03,756 ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేశామ‌ని, 1,84,264 ఉద్యోగాల‌ను శాశ్వ‌త ప్రాతిప‌దిక‌న‌, 3,99,791 ఉద్యోగాల‌ను పొరుగు సేవ‌ల రూపంలో భ‌ర్తీ చేశామ‌న్నారు. మ‌రో 19,701 ఒప్పంద ఉద్యోగాల‌ను ఇచ్చామ‌న్నారు. రూ.3500 కోట్ల భారం ప‌డుతుంద‌ని తెలిసినా ఆర్‌టీసీని ప్ర‌భుత్వంలో విలీనం చేసిన‌ట్లు తెలిపారు. 51,387 మంది ఆర్‌టీసీ ఉద్యోగుల‌కు ఉద్యోగ భ‌ద్ర‌త‌ను క‌ల్పించిన‌ట్లు వివ‌రించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now