Chiranjeevi : ఆచార్య ఫ్లాప్‌పై మ‌ళ్లీ కొరటాల‌ను నిందించిన చిరు.. ట్రోల్ చేస్తున్న నెటిజ‌న్లు..

October 2, 2022 10:27 AM

Chiranjeevi : సోషల్ కంటెంట్ కి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి ప్రేక్షకులను మెప్పించే డైరెక్టర్ కొరటాల శివ. ఆయన మొదటి సినిమా మిర్చి దగ్గర నుంచి భరత్ అనే నేను వరకు ప్రతి సినిమాలో సామాజిక అంశాన్ని టచ్ చేశారు. అలాంటి డైరెక్టర్ మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తున్నారంటే అంచనాలు మామూలుగా ఉండవు. అందులోనూ చిరు, చరణ్‌ కలిసి నటిస్తున్నారంటే ఫ్యాన్స్ కి పండగే అనుకున్నారు. కట్ చేస్తే.. ఆచార్య ఇటు డైరెక్టర్ కెరీర్ లో హీరో చిరు కెరీర్ లో అట్టర్ ఫ్లాప్ గా మిగిలిపోయింది. దీంతో చిరు ఎక్కడికి వెళ్లినా ఆచార్య ప్రస్తావన తప్పని సరైంది.

తాజాగా చిరంజీవి హీరోగా న‌టించిన గాడ్ ఫాదర్ మూవీ ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 5న రిలీజ్ అవుతుంది. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతున్న‌ప్పుడు ఆచార్య సినిమా ఫ్లాప్ గురించి ప్రస్తావన వచ్చింది. దానికి ఆయ‌న స్పందించిన తీరుపై నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇంతకీ మెగాస్టార్ ఏమన్నాడంటే.. కెరీర్ ప్రారంభంలో సక్సెస్ వచ్చినప్పుడు ఆనంద ప‌డేవాడిని.. ఫ్లాప్ వ‌చ్చిన‌ప్పుడు బాధ‌ప‌డేవాడిని. అవి అప్ప‌టి రోజులు. ఈ జ‌ర్నీలో చాలా నేర్చుకున్నాను. ఆచార్య విష‌యానికి వ‌స్తే ఆ సినిమా ఫ్లాప్ న‌న్ను బాధించ‌లేదు.

Chiranjeevi again blamed Koratala Siva netizen troll him
Chiranjeevi

ఎందుకంటే డైరెక్టర్ చెప్పింది చేశాం. బాధ‌ప‌డ్డ విష‌య‌మేమంటే.. నేను, చ‌ర‌ణ్ క‌లిసి తొలిసారి న‌టించాం. ఆ సినిమా ప‌రాజ‌యం బాధించింది. త‌ర్వాత మేం క‌లిసి న‌టించినా ఆ జోష్ ఉండ‌క‌పోవ‌చ్చు అని అన్నారు చిరంజీవి. అయితే ఆచార్య‌ ఫ్లాప్‌పై చిరంజీవి స్పందించిన తీరుని నెటిజ‌న్స్ వ్య‌తిరేకిస్తున్నారు. ఇద్ద‌రు స్టార్ హీరోల‌ను కాద‌ని.. కొర‌టాల శివ సినిమా డైరెక్ట్ చేస్తారా. ఫ్లాప్ వ‌స్తే దానికి అత‌న్నే పూర్తి బాధ్యుడ్ని చేయ‌టం ఎంత వ‌ర‌కు క‌రెక్ట్ అని కామెంట్స్ చేస్తున్నారు. ఏదిఏమైనా గాడ్ ఫాదర్ సక్సెస్ అయితే కానీ చిరు ఆచార్య డిజాస్టర్ నుంచి బయటకు వచ్చేలా లేడు. ఇక‌ గాడ్ ఫాదర్ ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now