Prudhvi Raj : 30 ఇయర్స్ పృథ్వీకి మైండ్ బ్లాక్‌.. నెల‌కు ఆమెకు రూ.8 ల‌క్ష‌లు ఇవ్వాల‌ట‌..!

October 1, 2022 7:05 PM

Prudhvi Raj : భార్యాభ‌ర్త‌లు విడాకులు తీసుకున్న‌ప్పుడు భ‌ర‌ణం అనేది భ‌ర్త‌కి పెద్ద త‌ల‌నొప్పిగా మారుతుంది. మ‌రీ ముఖ్యంగా భ‌ర్త బాగా సంపాదించే వాడో లేక సినీ న‌టులో అయితే అది భారీ మొత్తంలో ఉంటుంది. అమెరికా లాంటి దేశాల్లో ఈ భ‌ర‌ణం చెల్లించే విష‌యంలో చ‌ట్టాలు చాలా క‌ఠినంగా ఉంటాయి. భ‌ర‌ణం చెల్లించ‌డంలో తేడాలు వ‌స్తే మ‌గ‌వారు జైలుకి కూడా వెళ్ల వ‌ల‌సి వ‌స్తుంది. ఇలాంటి సంఘ‌ట‌న‌లు అక్క‌డ స‌ర్వ సాధారణంగా మ‌నం వింటూనే ఉంటాం. అయితే తెలుగు న‌టుడు, క‌మెడియ‌న్ 30 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ పృథ్వీరాజ్ విష‌యంలో కూడా కోర్టు ఇలాంటి తీర్పునే ఇవ్వ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

న‌టుడు పృథ్వీకి శ్రీల‌క్ష్మీ అనే ఆమెతో 1984 లో వివాహం జ‌రిగింది. వీరికి ఒక కొడుకు, ఒక కూతురు కూడా ఉన్నారు. అయితే 2016లో పృథ్వీ త‌న‌ను ఇంటి నుంచి గెంటివేశాడ‌ని అప్ప‌టినుండి త‌న త‌ల్లిదండ్రుల‌తో జీవిస్తున్నాని ఆమె కోర్టుకి తెలిపింది. కాగా ఈ విడాకుల కేసు సంద‌ర్భంగా ఆమె కోర్టుకు స‌మ‌ర్పించిన స్టేట్ మెంట్ లో.. త‌న భ‌ర్త‌ పృథ్వీ సినిమాలు, షోలు, సీరియ‌ల్స్ ద్వారా నెల‌కు రూ.30 ల‌క్ష‌లు సంపాదిస్తున్నాడ‌ని తెలిపింది. కాబ‌ట్టి త‌న‌కు భ‌ర‌ణం ఇప్పించాల‌ని కోరింది. ఈ క్ర‌మంలో వాద‌న‌ల‌ను ప‌రిశీలించిన విజ‌య‌వాడ ఫ్యామిలీ కోర్టు నెల‌కు 8 ల‌క్ష‌ల రూపాయ‌లు ఆమెకు భ‌ర‌ణం చెల్లించాల‌ని పృథ్వీని ఆదేశించింది. దీనికి సంబంధించి ప్ర‌తి నెల 10లోగా త‌న‌కు భ‌ర‌ణం ఇవ్వాల‌ని ఆర్డ‌ర్లు కూడా ఇవ్వ‌డం జ‌రిగింది.

Prudhvi Raj has to give rs 8 lakhs alimony to his wife
Prudhvi Raj

అయితే దీనిపై నెటిజ‌నులు వివిధ ర‌కాలుగా స్పందిస్తున్నారు. పృథ్వీ జ‌న‌సేన పార్టీలో చేరిన‌ప్ప‌టి నుండి త‌న జీవితంలో కూడా కొత్త ట్విస్టులు రావ‌డం జ‌రుగుతుంద‌ని జోకులు పేలుస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now