ఎస్‌బీఐ కొత్త ప‌ర్స‌న‌ల్ లోన్ స్కీమ్‌.. రూ.25వేల నుంచి రూ.5 ల‌క్ష‌ల రుణం పొందే చాన్స్‌..!

June 18, 2021 10:41 PM

క‌రోనా నేప‌థ్యంలో అనేక మంది ఆర్థిక ఇబ్బందుల‌ను ఎదుర్కొంటున్న సంగ‌తి తెలిసిందే. అయితే అలాంటి వారి కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కొత్త‌గా క‌వ‌చ్ ప‌ర్స‌న‌ల్ లోన్ కింద వ్య‌క్తిగ‌త రుణాల‌ను అంద‌జేసే స్కీమ్‌ను ప్రారంభించింది. ఈ స్కీమ్ కింద రూ.25వేల నుంచి రూ.5 ల‌క్ష‌ల వ‌ర‌కు రుణం పొంద‌వ‌చ్చు. దీనికి ఎలాంటి సెక్యూరిటీ అవ‌స‌రం లేదు. వినియోగ‌దారులు త‌మ‌కు, త‌మ కుటుంబ స‌భ్యుల‌కు కోవిడ్ చికిత్స‌కు అయ్యే ఖ‌ర్చును ఈ రుణంతో భర్తీ చేయ‌వచ్చు.

sbi gives personal loans unders kavach personal loan scheme

ఈ స్కీమ్ కింద తీసుకునే రుణానికి 8.5 శాతం వ‌డ్డీని చెల్లించాల్సి ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు ఉండ‌దు. ముంద‌స్తుగా రుణాన్ని చెల్లిస్తే ఎలాంటి చార్జిల‌ను వ‌సూలు చేయ‌రు. పెనాల్టీ కూడా ఉండ‌దు. ఈ స్కీమ్ కింద తీసుకునే రుణాల‌ను గ‌రిష్టంగా 5 ఏళ్ల కాల ప‌రిమితితో చెల్లించ‌వ‌చ్చు. అలాగే 3 నెల‌ల మార‌టోరియం స‌దుపాయం ల‌భిస్తుంది.

ఉద్యోగం చేసే వారు మాత్ర‌మే కాకుండా స్వ‌యం ఉపాధి పొందే వారు కూడా ఈ రుణానికి ద‌ర‌ఖాస్తు చేయ‌వ‌చ్చు. ఏప్రిల్ 1, 2021 త‌రువాత కోవిడ్ పాజిటివ్ వ‌చ్చిన వారు ఈ రుణం కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఈ రుణం పొందేందుకు అవ‌స‌ర‌మైన ప‌త్రాల‌ను బ్యాంకుకు స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. ఎస్‌బీఐ ఖాతాదారులు యోనో మొబైల్ బ్యాంకింగ్ యాప్ ద్వారా రుణం కోసం ద‌ర‌ఖాస్తు చేయ‌వ‌చ్చు. ఇత‌ర క‌స్ట‌మ‌ర్లు త‌మ‌కు స‌మీపంలోని ఎస్‌బీఐ బ్యాంక్ బ్రాంచిలో సంప్ర‌దించాల్సి ఉంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment