Rashmika Mandanna : తన అభిమాని హృదయంపై మర్చిపోలేని స్వీట్ గిఫ్ట్ ఇచ్చిన రష్మిక మందన్న‌..!

September 29, 2022 9:23 PM

Rashmika Mandanna : అందాల భామ రష్మిక క్రేజ్ రోజురోజుకు పెరుగుతోంది. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ స్థాయిని అందుకుంది. అంతే కాదు.. స్టార్ హీరోలకు ఇప్పుడు ఈ అమ్మడే ఫస్ట్ ఛాయిస్ అవుతుంది. కేవలం దక్షిణాదిన మాత్రమే కాకుండా.. బాలీవుడ్ లోనూ తన సత్తా చాటేందుకు ఆమె సిద్దమవుతుంది. ఇక ఇటు తెలుగులోనూ పుష్ప 2లో నటించనుంది. ఇటీవల విడుదలైన సీతారామంలోనూ ఆమె కీలక పాత్ర పోషించింది. అంతేకాకుండా నేషనల్ క్రష్ గా కూడా బిరుదు అందుకుంది.

ఇక ఈ పాపులారిటీతోనే బాలీవుడ్ లో వరుస అవకాశాలను అందుకుంది. ప్రెసెంట్ రష్మిక మందన్న బాలీవుడ్ లో బోలెడన్ని సినిమాలకు కమిట్ అయింది. దాదాపు 7 సినిమాల్లో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. రీసెంట్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ అనిపించుకున్న రష్మిక.. శ్రీవల్లి డీగ్లామర్ పాత్రలో లీనమై నటించింది. ప్రస్తుతం ఈ భామ ముంబైలో కనిపిస్తే అందరూ శ్రీవల్లి అని పిలుస్తున్నారట.. త్వరలోనే దీని సీక్వెల్ రానుంది. దీని కోసం రష్మిక రెమ్యూనరేషన్ భారీగానే డిమాండ్ చేస్తుందట.

Rashmika Mandanna given autograph for a fan
Rashmika Mandanna

రష్మిక క్రేజ్ చూసి నిర్మాతలు కూడా భారీ మొత్తం ముట్టజెప్పేందుకు ఓకే అన్నారట.. ఇక రష్మికకు యూత్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ క్రమంగా పెరుగుతోంది. తాజాగా రష్మిక నటించిన గుడ్ బై చిత్రం విడుదలకు సిద్ధంగా ఉండగా.. ప్రమోషన్స్‌లో పాల్గొంది రష్మిక.. ఈ క్రమంలోనే తన అభిమానికి లైఫ్ లాంగ్ గుర్తుండి పోయే గిఫ్ట్ ఇచ్చింది. ముందుగా అతని బుక్ లో సైన్ చేసిన రష్మిక.. ఆ తర్వాత అతని ఛాతీపై సంతకం చేసి చెరగని ముద్ర వేసింది. దీంతో అతని ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అభిమాని కోరిక తీర్చిన రష్మికను ఫ్యాన్స్ కూడా తెగ పొగిడేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now