ETV Prabhakar : నా కొడుకు అలాంటి వాడు.. వాడి వ‌ల్ల చాలా ఇబ్బందులు ప‌డుతున్నా.. ప్ర‌భాక‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

September 29, 2022 4:59 PM

ETV Prabhakar : టీవీ నటుడు ప్రభాకర్ ఇటీవల తెగ పాపులర్ అయిపోయాడు. దానికి కారణం ఆయన కుమారుడు చంద్రహాస్. కొన్నిరోజుల క్రితం చంద్రహాస్ డెబ్యూ మూవీ అనౌన్స్ మెంట్ జరిగింది. ఈ క్రమంలో ఓ ప్రెస్ మీట్ పెట్టి, తన కొడుకు కొత్త సినిమాల గురించి ప్రభాకర్ ప్రకటించాడు. అయితే ఈ ప్రెస్ మీట్ లో చంద్రహాస్ యాటిట్యూడ్ చూపించాడని సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ జరిగింది. దీంతో చంద్రహాస్ గురించి ఏ చిన్న వార్తొచ్చినా సరే నెటిజన్స్ ఇంట్రెస్ట్ చూపించడం మొదలుపెట్టారు. ఇప్పుడు తన కొడుకు చంద్రహాస్ గురించి నటుడు ప్రభాకర్.. ఎవ‌రికీ తెలియని ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు.

మీడియా ముందు ఎలా మెలగాలో నా కొడుక్కి ఇంకా తెలియదని.. మెల్లమెల్లగా అన్నీ వాడే నేర్చుకుంటాడని అన్నాడు. తన కుమారుడి గురించి చెబుతూ మా వాడికి బ్రాండ్ పిచ్చి బాగా ఉంది. నాకు అలాంటి పట్టింపులు ఏమీ ఉండవు. ఏదో ఒకటి వేసుకుందామని అనుకుంటానని అన్నాడు. కానీ మా వాడు మాత్రం బ్రాండ్ దుస్తులు వేసుకుంటాడు అని చెప్పాడు. తనకు ఏ గాడ్జెట్ అయినా వస్తువైనా బ్రాండెడ్ ఉండాలని కోరుకుంటాడ‌ని తెలిపాడు. అంతేకాకుండా ఓసారి అమెరికా నుంచి వాచ్ తీసుకు వ‌స్తే ఇది బ్రాండ్ కాదు అంటూ పక్కన పడేశాడని తెలిపాడు.

ETV Prabhakar said about his son Chandra Hass is branded person
ETV Prabhakar

వస్తువును చూడగానే అది బ్రాండా కాదా అనే విషయంలో ఇప్పటి పిల్లలు ఇట్టే కనిపెట్టేస్తార‌ని అన్నాడు. అంతేకాకుండా మంచో చెడో సినిమా చేయకుండానే చంద్రహాస్ కు చాలా పాపులారిటీ వచ్చిందని చెప్పాడు. ఎంతో డబ్బులు ఖర్చు పెడితే కానీ ఇలాంటి ప్రచారం జరగదని అన్నాడు. ప్రస్తుతం చంద్ర‌హాస్ రెండు వేర్వేరు బ్యానర్లలో సినిమాలు చేస్తున్నాడని ఓ సినిమా తన సొంత బ్యానర్ లో చేస్తున్నాడ‌ని చెప్పాడు. చంద్రహాస్ ఇంట్లో నుండి రూ.10 లక్షలు తీసుకుని ఆర్ఆర్ఆర్ కవర్ సాంగ్ చేయగా ఆ సాంగ్ చూసి సినిమా ఆఫర్ వచ్చిందని తెలిపాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now