Chintha Chiguru : చింత చిగురుతో ప్ర‌యోజ‌నాలు అద్భుతం.. ఎక్క‌డ క‌నిపించినా సరే వ‌ద‌లొద్దు..!

September 27, 2022 7:54 PM

Chintha Chiguru : మ‌న‌కు ఈ సీజ‌న్‌లో ఎక్క‌డ చూసినా సరే చింత చిగురు అధికంగా ల‌భిస్తుంది. దీన్ని చాలా మంది పప్పు లేదా ప‌చ్చ‌డి రూపంలో త‌యారు చేసుకుని తింటుంటారు. ఈ వంట‌కాలు ఎంతో రుచిగాఉంటాయి. అయితే కేవ‌లం రుచిని మాత్ర‌మే కాదు.. చింత చిగురు మ‌న‌కు ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను కూడా అందిస్తుంది. దీన్ని తీసుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

చింత చిగురులో విట‌మిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. దీంతో సీజ‌న‌ల్ గా వ‌చ్చే వ్యాధుల నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు. ముఖ్యంగా ద‌గ్గు, జ‌లుబు త‌గ్గుతాయి. ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా ఉంటాయి.

Chintha Chiguru or Tamarind leaves amazing health benefits
Chintha Chiguru

చింత చిగురులో ఐరన్ స‌మృద్ధిగా ఉంటుంది. ఇది ర‌క్తం బాగా త‌యార‌య్యేలా చేస్తుంది. ర‌క్త‌హీన‌త‌ను త‌గ్గిస్తుంది. అలాగే దీంట్లో ఉండే పోష‌కాల వ‌ల్ల పాలిచ్చే త‌ల్లులు దీన్ని తింటే వారిలో పాలు బాగా ఉత్ప‌త్తి అవుతాయి. మ‌హిళ‌లు దీన్ని తింటే నెల‌స‌రి స‌మ‌యంలో వ‌చ్చే స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. హార్మోన్లు స‌రిగ్గా ప‌నిచేస్తాయి.

చింత చిగురులో యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ ల‌క్ష‌ణాలు ఉంటాయి. అందువ‌ల్ల నొప్పులు, వాపులు త‌గ్గుతాయి. ముఖ్యంగా కీళ్ల నొప్పులు ఉన్న‌వారికి మేలు జ‌రుగుతుంది. చింత చిగురులో ఉండే విట‌మిన్ సి దంతాల‌ను, చిగుళ్ల‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది. చిగుళ్ల నుంచి అయ్యే ర‌క్త‌స్రావం త‌గ్గుతుంది. నోటి దుర్వాస‌న నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

మ‌లేరియా జ్వ‌రం వ‌చ్చిన వారు చింత చిగురు తింటే త్వర‌గా కోలుకుంటారు. అలాగే ప‌చ్చకామెర్ల‌కు, మ‌ధుమేహం ఉన్న‌వారికి కూడా ఇది మెడిసిన్‌లా ప‌నిచేస్తుంది. దీంతో ఆయా స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఇక చింత చిగురును కాస్త తీసుకుని దంచి ముద్ద‌లా చేసి క‌ట్టు క‌డుతుంటే గాయాలు, పుండ్లు త్వ‌ర‌గా మానుతాయి. ఇలా చింత చిగురు మ‌న‌కు ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. క‌నుక ఇది ఎక్క‌డ క‌నిపించినా అస‌లు విడిచిపెట్ట‌కుండా తినాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment