Gajuwaka Conductor Jhansi : ఎక్స్ ట్రా జబర్దస్త్ షో లో కంటతడి పెట్టుకున్న కండక్టర్ ఝాన్సీ.. వైరల్ అవుతున్న వీడియో..

September 22, 2022 12:03 PM

Gajuwaka Conductor Jhansi : బుల్లితెరలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షోకి ప్రజల్లో ఎంత ఆదరణ ఉందో అందరికీ తెలిసిందే. ఈ కామెడీ షో ఎంతో మంది ఆర్టిస్ట్ లకు జీవితాన్ని ఇచ్చింది. అంతేకాకుండా మల్లెమాల సంస్థ జబర్దస్త్ కు తోడు ఎక్స్ ట్రా జబర్దస్త్ ను మొదలుపెట్టి దిగ్విజయంగా కొనసాగిస్తుంది. ఎక్స్ ట్రా జబర్దస్త్ షో కి రష్మీ గౌతమ్ యాంకర్ గా వ్యవహారిస్తున్న సంగతి తెలిసిందే. ఈవారం ఎక్స్ ట్రా జబర్దస్త్ ఎపిసోడ్ కు సంబందించిన ప్రోమో విడుదల చేశారు షో నిర్వాహకులు. ఈ ప్రోమో లో జడ్జిలుగా ఇంద్రజతో పాటు సింగర్ మనో కూడా కనిపిస్తుండటం విశేషం. ఈ ప్రోమో మొత్తం కామెడీ పంచులతో చూసేవారిని ఎంతగానో ఆకట్టుకుంది.

ఈ ప్రోమోలో ఎప్పటిలాగానే రామ్ ప్రసాద్, రాకింగ్ రాకేష్ టీమ్ స్కిట్ల‌తో అందరినీ కడుపుబ్బ నవ్వించారు. బుల్లెట్ భాస్కర్ టీంలో ఇమ్మానుయేల్, వర్షల కామెడీ వీక్షకులను ఆకట్టుకుంది. ఈసారి భాస్కర్ టీంలో పల్సర్ బండి పాటతో ఫేమస్ అయిన‌ కండక్టర్ ఝాన్సీ తన పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకోవడం జరిగింది. ఇదివరకే ఝాన్సీ శ్రీదేవి డ్రామా కంపెనీ లో తన మాస్ డాన్స్ తో ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక స్టేజి మీద రష్మీ కండక్టర్ ఝాన్సీని డాన్స్ పెర్ఫార్మన్స్ తరువాత మీ లైఫ్ ఎలా వుంది అని ప్రశ్నించగా.. ఒక్కసారిగా ఝాన్సీ స్టేజి మీదనే ఎమోషనల్ అయ్యింది.

Gajuwaka Conductor Jhansi gets emotional on extra jabardasth stage
Gajuwaka Conductor Jhansi

మొదట్లో అందరూ ఎందుకు డాన్స్ చేసావు అని అన్నవాళ్ళే.. కానీ ఇప్పుడు నాకు ఫోన్ చేసి మీ వల్ల మా కుటుంబం పరువు నిలబడిందని అంటున్నారు. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చి, నన్ను ఈ స్టేజికి తీసుకొచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ ఝాన్సీ భావోద్వేగానికి లోనయ్యారు. ప్రస్తుతం ప్రోమోలోని గాజువాక కండక్టర్ ఝాన్సీ మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment