ఎట్టకేలకు తన పెళ్లి సీక్రెట్ బయటపెట్టిన నటి ప్రణీత

June 18, 2021 10:15 PM

కరోనా కారణం వల్ల సినిమా షూటింగ్ లు ఆగిపోవడంతో ఎంతో మంది సినీ సెలబ్రిటీలు పెళ్లిపీటలు ఎక్కారు. ఈ క్రమంలోనే నటి ప్రణీత కూడా ఎవరికీ తెలియకుండా వివాహబంధంతో ఒక్కటై అందరినీ ఎంతో ఆశ్చర్యానికి గురి చేసిన సంగతి మనకు తెలిసిందే. నటి ప్రణీత బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త,చిన్ననాటి స్నేహితుడు, నితిన్‌ రాజును మే 31న పెళ్లి చేసుకున్నారు.

ఈ క్రమంలోనే వీరి పెళ్లికి హాజరైన ఓ స్నేహితుడు వీరు పెళ్లి ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ విషయం అందరికీ తెలిసింది. ఈ నేపథ్యంలోనేపెళ్లి తర్వాత మొట్ట మొదటిసారిగా స్పందించిన నటి ప్రణీత ఎట్టకేలకు తను రహస్యంగా పెళ్లి చేసుకోవడానికి గల కారణాన్ని బయటపెట్టారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రణిత తన పెళ్లి రహస్యంగా చేసుకోవడం గురించి తెలిపారు. ప్రస్తుతం కరోనా తీవ్రస్థాయిలో వ్యాపిస్తున్న నేపథ్యంలోనూ, ఆషాడ మాసం దగ్గరగా ఉండడం వల్ల తన పెళ్లిని ఎంతో ఘనంగా కాకుండా నిరాడంబరంగా జరుపుకోవాలని భావించడం వల్లే తన పెళ్లి చేసుకుంటున్న సంగతి ఎవ్వరికీ తెలియకుండా చేసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం దేశం మొత్తం ఎంతో సంక్షోభం ఎదుర్కొంటున్న సమయంలో తన పెళ్లి ఆడంబరంగా జరుపుకోవడం సరికాదని భావించడం వల్లే ఇలా చేసుకున్నానని ప్రణీత అసలు విషయం బయట పెట్టారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now