Praneetha : ప్రణీత భర్త ఏం చేస్తాడో తెలుసా.. అతనికి ఎన్ని కోట్ల ఆస్తులున్నాయో అస్సలు ఊహించలేరు..!

September 21, 2022 3:42 PM

Praneetha : టాలీవుడ్ కు చెందిన కన్నడ ముద్దుగుమ్మ ప్రణీత సుభాష్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఏం పిల్లో ఏం పిల్లడో చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ప్రణీత కెరీర్‌లో అంత‌గా సక్సెస్ కాలేదు. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది. అయినా అమ్మడికి అవకాశాలు బాగానే వచ్చాయి. పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో అత్తారింటికి దారేది, మ‌హేశ్‌బాబుతో బ్రహ్మోత్సవం, జూనియ‌ర్ ఎన్టీఆర్ తో ర‌భ‌స, మంచు విష్ణుతో పాండ‌వులు పాండ‌వులు తుమ్మెద, రామ్‌తో హ‌లో గురు ప్రేమ‌కోస‌మే చిత్రాల‌తో అల‌రించింది.

గ‌తేడాది హంగామా 2, భూజ్ సినిమాల‌తో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. అయితే ఏ భాషలోనూ ప్రణీత స్టార్ హీరోయిన్‌గా నిలదొక్కుకోలేకపోయింది. దీంతో బెంగళూరుకు చెందిన నితిన్ రాజ్ అనే ఓ బిజినెస్ మాన్ ను పెళ్లి చేసుకుంది. ఇటీవలే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. అయితే కరోనా సమయంలో ఫాన్స్ కి తెలియ‌కుండా సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది ప్రణీత. దీంతో వీరిది ప్రేమ పెళ్లా, పెద్దలు కుదిర్చిందా అనే చర్చ సోషల్ మీడియాలో నడుస్తోంది.

Praneetha husband nitin raju and his business
Praneetha

అంతేకాదు ప్రణీత భర్త ఏం చేస్తాడు, అతనికి ఎన్ని కోట్ల ఆస్తి ఉంది అంటూ వార్తలు ట్రెండ్ అవుతున్నాయి. ఆమె భర్త ఏమాత్రం సినిమా రంగానికి చెందిన వ్యక్తి కాదు. అయితే అతడికి చాలా వ్యాపారాలు ఉన్నాయట. స్కూల్ డీ హాస్పిటాలిటీ కాలేజీలో చదువుకున్న అతను హాస్పిటల్ మేనేజ్ మెంట్ లో ఉన్నత చదువు పూర్తి చేశాడు. బ్లూ హారిజన్ పేరిట హోటల్స్ పెట్టి హోటల్ రంగంలో రాణిస్తున్న నితిన్ రాజు లాభాల బాటలో హోటల్స్ రన్ చేస్తున్నాడని, మంచి డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడని టాక్. ఈ క్ర‌మంలోనే అత‌నికి వేల కోట్ల ఆస్తులు ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఇందులో నిజం ఎంత ఉంది అనే విష‌యం తెలియాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment