Oke Oka Jeevitham : శ‌ర్వానంద్ ఒకే ఒక జీవితం సినిమాకు ప్రేక్ష‌కుల బ్ర‌హ్మ‌ర‌థం.. బింబిసార లాంటి సినిమా కావ‌డంతోనే..!

September 12, 2022 7:16 PM

Oke Oka Jeevitham : ఒక సినిమా విజ‌యవంతం అవ‌డానికి ముందుగా మంచి రివ్యూలు.. ఆ త‌రువాత ప్రేక్ష‌కుల మౌత్ ప‌బ్లిసిటీ లాంటివి చాలా ముఖ్యమైన‌వి. ఒక్కోసారి రివ్యూలు బాగా లేన‌ప్ప‌టికీ వీక్ష‌కులు ఆద‌రించిన‌పుడు వారి నోటి ద్వారా సినిమాకు కావాల్సింనంత ప్ర‌చారం జ‌రుగుతుంది. అయితే తాజాగా శ‌ర్వానంద్ న‌టించిన ఒకే ఒక జీవితం సినిమాకు ఇవి రెండూ బాగానే క‌లిసివ‌చ్చిన‌ట్ట‌గా తెలుస్తోంది.

ఈ చిత్రంపై సినీ విశ్లేష‌ల‌కుల నుండి మిశ్ర‌మ స్పంద‌న ల‌భించింది. కొంద‌రు ఈ సినిమాను ఎంతో మెచ్చుకోగా మ‌రికొంద‌రు ఈ చిత్రం సాగదీసిన‌ట్టుగా ఉంద‌ని విమ‌ర్శించారు. కానీ ప్రేక్ష‌కులు మాత్రం ఈ సినిమాకు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ఈ చిత్రంలోని హీరో చాలా కాలం క్రితం ఒక యాక్సిడెంట్ వ‌ల‌న‌ చ‌నిపోయిన త‌న త‌ల్లిని క‌లుసుకోవ‌డానికి టైమ్ ట్రావెల్ చేయ‌డం జ‌రుగుతుంది. అప్ప‌డు జ‌రిగే సెంటిమెంటల్ ఇంకా ఎమోష‌నల్ డ్రామా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుందని దాని వ‌ల‌న వారు థియేట‌ర్ల‌కు రావ‌డం పెరిగింద‌ని విశ్లేషిస్తున్నారు.

Oke Oka Jeevitham getting positive talk day by day
Oke Oka Jeevitham

ఇదే విధంగా ఈ మ‌ధ్యనే బింబిసార, సీతారామం సినిమాలు కూడా పాజిటావ్ టాక్ ఇంకా మౌత్ ప‌బ్లిసిటీ తో బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాన్ని సొంతం చేసుకున్నాయి. అలాగే ఒకే ఒక జీవితం చిత్రం కూడా వివిధ వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు న‌చ్చ‌డంతో రోజురోజుకీ క‌లెక్ష‌న్ల‌ను పెంచుకుంటూ బాక్సాఫీస్ విజ‌యం దిశ‌గా వెళ్తుంద‌ని భావిస్తున్నారు.

ఇక తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో బింబిసార, సీతారామం సినిమాల త‌రువాత మ‌రొక విజ‌యం రానుండ‌డంతో నిర్మాత‌లు ఇంకా డిస్ట్రిబ్యూట‌ర్లు ఆనందంగా ఉండ‌టంతో పాటు, మంచి క‌థ క‌థ‌నాలు ఉన్న చిత్రాల‌ను ప్రేక్ష‌కులు ఎప్పుడూ ఆద‌రిస్తార‌ని ఆశిస్తున్నట్టుగా తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment