Amala Paul : తెలుగు సినిమా ఇండ‌స్ట్రీని అందుకే విడిచిపెట్టా.. అస‌లు కార‌ణం చెప్పిన అమ‌లాపాల్‌..

September 12, 2022 8:07 PM

Amala Paul : మలయాళం చిత్రాలతో కెరీర్ ను ప్రారంభించిన అమలాపాల్.. నాగ చైతన్య సరసన హీరోయిన్ గా బెజవాడ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో నటించినవి నాలుగు చిత్రాలే అయినా నాయక్ చిత్రం ఒక్కటే ఆమెకు సక్సెస్ ను అందించింది. ఇద్దరమ్మాయిలు, జెండాపై కపిరాజు, బెజవాడ చిత్రాలు పరాజయాలుగా నిలిచాయి. ఆ తర్వాత తెలుగులో అమలాపాల్ ఎక్కువగా కనపడట్లేదు. తమిళ చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. చాలా రోజుల తర్వాత ఇటీవల ఓటీటీ ఫిల్మ్ పిట్టకథల ద్వారా అందరినీ ఆకట్టుకుంది. అమలాపాల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలుగు ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేసింది.

నేను తెలుగు ఇండ‌స్ట్రీకి వెళ్లిన‌పుడు అక్క‌డ ఇండస్ట్రీ ఆ ఫ్యామిలీల కంట్రోల్‌లో ఉంద‌ని అర్థమైంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కడ స్టార్ల కుటుంబాల వారిదే ఆధిపత్యం ఎక్కువ. వాళ్ళు తీసే సినిమాలు చాలా విభిన్నంగా ఉంటాయి. చాలా వరకు అన్నీ కమర్షియల్ సినిమాలే ఉంటాయి. తెలుగు సినిమాల్లో చాలావరకు ఇద్ద‌రు హీరోయిన్లు ఉండాల్సిందే. ప్రేమ స‌న్నివేశాలు, పాట‌లు అన్నీ గ్లామరస్ షో కోసమే హీరోయిన్స్ ఉన్నట్లు అనిపిస్తుంది.

Amala Paul sensational comments on telugu heroes
Amala Paul

ఇక మిగతా సినిమా మొత్తం హీరోల‌ ఆధిపత్యమే కనిపిస్తుంది. అందుకే అవన్నీ నాకు నచ్చక తెలుగులో అవకాశాలు వచ్చినా చాలా సినిమాలు వదులుకున్నాను. ఈ కారణంగానే తెలుగు ఇండ‌స్ట్రీలో ప్రేక్షకులకు సినిమాల ద్వారా దగ్గర అవ్వలేకపోయాను అని అమలాపాల్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. తెలుగు ఇండస్ట్రీకి దూరంగా ఉండటానికి గల కారణం ఇదే అంటూ చెప్పుకొచ్చింది. ఈ ఇంటర్వ్యూ ద్వారా అమలాపాల్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్ లో వైరల్ గా మారాయి.

కోలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో సినిమాలు చేయడంపై ప్రశంసలు కురిపించింది. తమిళంలో సినిమాలు చేయడం అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పుకొచ్చింది. కోలీవుడ్ పరిశ్రమ కొత్త వారికి అవకాశాలు కల్పించడంలో ఎప్పుడూ ముందు ఉంటుంది అంటూ ప్రశంసల వర్షం కురిపించింది. కోలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన మొదట్లో చేసిన రెండు చిత్రాలు ఇప్పటికీ విడుదల కాలేదని తెలియజేసింది.

నేను నటించిన మూడో చిత్రం మైనా సంచలన విజయం సాధించి తనకు మంచి గుర్తింపుని తీసుకురావడంతోపాటు ఓవర్‌నైట్‌లో స్టార్‌గా గుర్తింపు పొందాను అంటూ చెప్పింది. మైనా సినిమా తర్వాత వరుసగా ఆఫర్స్ క్యూ కట్టాయని, పెద్ద స్టార్స్ తోనూ కలిసి నటించే అవకాశాలు వచ్చాయని అమలాపాల్‌ పేర్కొంది.  మలయాళ ముద్దుగుమ్మ అమలాపాల్‌ ఇటీవల కడెవర్‌ చిత్రంతో ప్రేక్షకులను అలరించింది. ఈ చిత్రం ఓటీటీలో కూడా విడుదలైంది. అమలాపాల్ ప్రస్తుతం మలయాళంలో టీచర్‌, క్రిస్టోఫర్‌, ఆడుజీవితం చిత్రాల‌లో నటిస్తూ బిజీగా ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment