Suman : అన్నమయ్య చిత్రంలో వెంకటేశ్వరస్వామి పాత్రను మిస్ చేసుకున్న ఆ హీరోలు ఎవరో తెలుసా..!

September 10, 2022 11:57 AM

Suman : అక్కినేని నాగేశ్వరావు వారసుడిగా ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాగార్జున ఎన్నో సక్సెస్ ల‌తో స్టార్ హీరో అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలతో సరి సమానంగా ఇండస్ట్రీలో స్టార్ హీరో స్టేటస్ ను సొంత చేసుకున్నాడు. విక్రమ్  సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు నాగార్జున. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఆఖరి పోరాటం చిత్రంతో ఘన విజయం అందుకొని నాగార్జున హీరోగా స్థిరపడ్డారు. మణిరత్నం గీతాంజలి, రామ్ గోపాల్ వర్మ శివ వంటి వరస విజయాలతో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు.

శివ చిత్రంతో తెలుగు సినిమా స్థితిని మార్చి ట్రెండ్ సెట్టర్ అయ్యారు. ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, అల్లరి అల్లుడు, ఘరానా బుల్లోడు, హలో బ్రదర్ వంటి సినిమాలతో మాస్ ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. నిన్నే పెళ్ళాడతా వంటి చిత్రంతో రొమాంటిక్ హీరోగా ప్రేక్షకులలో గుర్తింపు పొందిన నాగార్జున ఆ తర్వాత రాఘవేంద్రరావు దర్శకత్వంలో అన్నమయ్య చిత్రాన్ని ప్రారంభించారు. రొమాంటిక్ హీరోగా పేరు సంపాదించిన నాగార్జున అన్నమయ్య చిత్రాన్ని ఏ మేరకు ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారో అనే సందేహం అప్పట్లో సినీ జనాలు అందరిలో నెలకొంది.

do you know who missed suman character in annamayya movie
Suman

అన్నమయ్య, శ్రీరామదాసు వంటి భక్తిరస చిత్రాలతో భక్తుడిగా ప్రేక్షకులలో స్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు నాగార్జున. అయితే అన్నమయ్య చిత్రంలో తిరుమల వెంకటేశ్వర స్వామి భక్తుడిగా అన్నమయ్య పాత్రలో నాగార్జున జీవించేశారనే చెప్పచ్చు. 1997లో రిలీజ్ అయిన‌ అన్నమయ్య ఆంధ్రరాష్ట్రాన్ని భక్తి భావంతో ఆకట్టుకుంది. ఈ చిత్రంలో వెంకటేశ్వరస్వామి పాత్రలో సుమన్ కూడా చాలా అద్భుతమైన నటనను కనబరిచారు. అయితే ఈ పాత్రకు ముందుగా సుమన్ చేయాల్సింది కాదట.

అప్పటికే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నాగార్జున వెంకటేశ్వర స్వామి భక్తునిగా చాలమట్టుకు సన్నివేశాల్లో ఆయన కాళ్ళ మీద పడే సన్నివేశాలు ఉన్నాయి. దానివలన వెంకటేశ్వరస్వామి పాత్రకు గాను ఒక సీనియర్ స్టార్ హీరో అయితే బాగుంటుందని రాఘవేంద్ర రావు ముందుగా నటభూషణ శోభన్ బాబును సంప్రదించారట. కానీ ఆయన ఆ పాత్రను వదులుకోలేక రూ.50 లక్షలు పెద్ద మొత్తంలో అడగడంతో ఆయన్ని పక్కన పెట్టి, ఈ పాత్రకు గాను బాలకృష్ణను సంప్రదించారట.

ఇద్దరు స్టార్ హీరోలు అలాంటి పాత్రలలో కనిపిస్తే అభిమానులు సినిమాను ఎలా ఆదరిస్తారో అనే భయంతో దర్శకరత్న రాఘవేంద్రరావు వెనక్కి తగ్గారట. ఇక ఆ తర్వాత సుమన్ అయితే ఈ క్యారెక్టర్ కి బాగుంటుందని భావించి సుమన్ ని  పిలిపించి కథ వినిపించటం జరిగిందట. సుమన్ కి కథ నచ్చడంతో ఆ తర్వాత ఫోటో షూట్ కూడా నిర్వహించి సుమన్ ఈ పాత్రకు పర్ఫెక్ట్ అని భావించి ఆయనను ఫిక్స్ చేశారట రాఘవేంద్రరావు. అలా సుమన్ కూడా అన్నమయ్య చిత్రం సక్సెస్ అవ్వడంలో తనవంతు పాత్ర పోషించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now