Ritika Singh : ఊర మాస్ డాన్స్ తో రచ్చ చేసిన రితికా సింగ్.. ఫిదా అవుతున్న నెటిజన్లు.. వీడియో..

September 7, 2022 9:03 PM

Ritika Singh : విక్టరీ వెంకటేష్ నటించిన గురు మూవీతో తెలుగు వారికి పరిచయమైంది రితికా సింగ్. ఈ సినిమాలో ఊర మాస్ క్యారెక్టర్ లో నటించి ఆకట్టుకుంది. అయితే రితిక తెలుగు సినీపరిశ్రమలో ఆశించినంతగా బిజీ కాలేకపోయింది. ప్రస్తుతానికి తమిళంలోనే అడపాదడపా నటిస్తోంది. లారెన్స్ తో హారర్ సినిమాలోనూ రితికా సింగ్ నటించింది. అయినా తనకు పెద్దగా ఆఫర్లు రావడం లేదు. తెలుగులోనూ మరికొన్ని సినిమాల్లో నటించినా అంతగా గుర్తింపు మాత్రం రాలేదు.

తమిళంలో రితికా సింగ్ నటించిన ఓమై కడవులే అనే సినిమా మాత్రం మంచి విజయం సాధించింది. ఆ సినిమాను ఇప్పుడు తెలుగులో రీమేక్ కూడా చేస్తున్నారు. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటోంది. సోషల్ మీడియాలో ఫోటోషూట్స్, వీడియోలతో రెచ్చిపోతుంది ఈ అమ్మడు. దీంతో రోజురోజుకీ సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇప్పటి వరకు తను షేర్ చేసిన ఫోటోషూట్స్ వైరల్ అయిన విషయం తెలిసిందే.

Ritika Singh latest dance video viral
Ritika Singh

తాజాగా రితిక ఓ డాన్స్ వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో ఇంతకు ముందెప్పుడు చూడని అందాలను ఆరబోసింది. తన డ్యాన్స్ వీడియోను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. పొట్టి డ్రెస్ వేసుకొని రితిక చేసిన డ్యాన్స్ కుర్రకారు మతిపోగొట్టేస్తుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. వామ్మో.. రితికలో ఇంత టాలెంట్ ఉందా అంటూ అవాక్కవుతున్నారు. దీన్నిబట్టి చూస్తే.. కెరీర్ పరంగా స్లోగా ఉన్నా.. హిట్టు కొట్టి రేస్ లో తానేమీ తక్కువ కాదని నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment