Bangaram Girl : బంగారం యువ‌తికి జ‌బ‌ర్ద‌స్త్ ఆఫ‌ర్‌..? ఓవ‌ర్‌నైట్ స్టార్ అయిన ఆమె వివ‌రాలు ఇవిగో..!

September 1, 2022 12:18 PM

Bangaram Girl : సోష‌ల్ మీడియాలో ప్ర‌స్తుతం చాలా మంది ఫేమ‌స్ అవుతున్నారు. అలాగే బంగారం.. అనే డైలాగ్‌తో ఆ అమ్మాయి ఫేమ‌స్ అయింది. దీంతో ఆమె సోష‌ల్ మీడియాలో అంద‌రికీ బాగా ప‌రిచ‌యం అయింది. అయితే ఇంత‌కీ అస‌లు ఆమె ఎవ‌రు.. ఆమె వివ‌రాలు ఏమిటి.. అనే విష‌యాల‌ను తెలుసుకునేందుకు చాలా మంది ఆస‌క్తి చూపిస్తున్నారు. అయితే తాజాగా ఆమె ఓ యూట్యూబ్ చాన‌ల్‌కు ఇంట‌ర్వ్యూ ఇవ్వ‌డంతో అస‌లు ఆమె ఎవ‌రు.. అన్న విష‌యం తెలిసిపోయింది. ఈ క్ర‌మంలోనే ఆమె వీడియో వైర‌ల్ అవుతోంది.

ఆ వీడియో చేసిన అమ్మాయి పేరు శాంతి. మతిస్థిమితం లేని శాంతి తండ్రి చిన్నప్పుడే ఇంటి నుండి పారిపోయాడు. కన్న తండ్రి కోసం కొన్నాళ్ళు ఊళ్లు, వీధులు పట్టుకొని తిరిగారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. శాంతికి తల్లితోపాటు ఓ తమ్ముడు ఉన్నాడు. 10వ తరగతి వరకు చదువుకుంది. కుటుంబ పోషణ కోసం కూలి పనులకు వెళుతూ ఉంటుంది. అనేక సందర్భాల్లో తన తల్లి దూషణకు గురైంది. కొందరు తన తల్లిని కొట్టారని చెబుతూ శాంతి ఆవేదన చెందింది.

Bangaram Girl here are the details about her
Bangaram Girl

 

సోషల్ మీడియాలో వీడియోలు చేయడం అలవాటు చేసుకున్న శాంతి కొత్తగా ఏదైనా చేయాలి అనుకుంది. ఓ రోజు బంగారం నీ గురించి అందరూ అడుగుతున్నారు.. అంటూ తన లవర్ తో మాట్లాడుతున్నట్లు ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. క్యూట్ నెస్, ఇన్నోసెన్స్ కలగలిపి ముచ్చటగొలిపేలా ఉన్న ఆ వీడియో వైరల్ గా మారింది. దాంతో ఓవర్ నైట్ శాంతి ఫేమ్ తెచ్చుకుంది. ఆమె డైలాగ్ ల‌ను చెబుతూ వేలల్లో సోషల్ మీడియా వీడియోలు పుట్టుకొచ్చాయి. డీజే సాంగ్స్ చేశారు.

అయితే ప్ర‌స్తుతం శాంతికి జ‌బ‌ర్ద‌స్త్ నుంచి ఆఫ‌ర్ వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. దీంతో ఆమె త్వ‌ర‌లోనే జ‌బ‌ర్ద‌స్త్ స్కిట్స్‌లో క‌నిపించ‌నుంద‌ని అంటున్నారు. ఆమె జబర్దస్త్ స్కిట్స్ ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోలు బయటికి వచ్చాయి. జబర్దస్త్ కమెడియన్స్ తో శాంతి క‌నిపించింది. దీంతో ఆమె త్వరలోనే జబర్దస్త్ వేదికపై కనిపిస్తుంద‌ని అంటున్నారు. అయితే ఆమె షోలో ఎప్పుడు క‌నిపిస్తుందో చూడాలి. దీంతో ఆమె జీవిత‌మే మారిపోనుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now