Acharya Child Artist : ఆచార్యలో న‌టించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవ‌రో తెలుసా.. సినిమా ఛాన్స్ ఎలా వ‌చ్చిందంటే..?

September 1, 2022 9:34 AM

Acharya Child Artist : మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా స్టార్ డైరెక్టర్‌ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆచార్య. ఇందులో మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్ ఓ కీలక పాత్రలో నటించాడు. ఇక చిరంజీవి, చెర్రీలు ఒకే స్ర్కీన్‌లో కనిపించడంతో అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. ఆచార్య సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ కాగా మణిశర్మ అందించిన పాటలు బాగానే ఆకట్టుకున్నాయి. అలాగే ఈ చిత్రంలో సోనూ సూద్ విల‌న్ గా నటించాడు. ఇక ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రానికి డిజాస్టర్ టాక్ వచ్చింది. తొలిసారి కెరీర్ లో అపజయం మూట కట్టుకున్నాడు కమర్షియల్ డైరెక్టర్ కొరటాల శివ.

అయితే ఈ సినిమాలో కనిపించిన ఓ ఛైల్డ్‌ ఆర్టిస్‌ అందరినీ ఆకట్టుకున్నాడు. ఆ బాలుడి పేరు మిథున్‌ శ్రేయాష్‌. తెలంగాణలోని మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన డాక్టర్‌ భీమనాథుని సదానందం కుమారుడు శ్రీధర్‌, సరిత దంపతుల కుమారుడే ఈ మిథున్‌. వీరు ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లో ఉంటున్నారు. మిథున్‌ సెయింట్‌ జోసెఫ్‌ హైస్కూల్‌లో 5వ‌ తరగతి చదువుతున్నాడు. కాగా మెగాస్టర్‌ చిరంజీవి సినిమాలో తన మనవడు నటించడం పట్ల సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు డాక్టర్‌ సదానందం.

do you know about Acharya Child Artist
Acharya Child Artist

ఆచార్య మూవీలో ఛైల్డ్‌ ఆర్టిస్ట్‌ కోసం వెతుకుతున్నారని శ్రీధర్‌ మిత్రుడు విజయ్‌కుమార్‌ మా దృష్టికి తీసుకొచ్చారు. మాకు తెలిసిన వారి ద్వారా మా మనవడిని సినిమా వాళ్లకి పరిచయం చేశాం. ఆడిషన్‌లో బాగా డైలాగ్‌లు చెప్పడంతో సినిమాకు ఎంపిక చేశారు. రాజమండ్రి మారెడుమల్లె, కోకాపేట ప్రాంతాల్లో జరిగిన షూటింగ్‌లో పాల్గొన్నాడు. చిరంజీవి సినిమాలో నా మనవడు నటించడం ఎంతో సంతోషంగా ఉంద‌ని సదానందం చెప్పుకొచ్చారు. కాగా ఈ సినిమాలో భాగమైనందుకు గాను పట్టణంలోని ప్రైవేట్‌ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో మిథున్‌ని అభినందించారు. ఆచార్యలో అభినయంతో ఆకట్టుకున్న మిథున్ ముందు ముందు మరిన్ని సినిమా అవకాశాలు సొంతం చేసుకుంటాడేమో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment