Rana Daggubati : ద‌గ్గుబాటి రానా, జూనియ‌ర్ ఎన్టీఆర్ బావ బావ‌మ‌రుదులా..? ఈ రిలేషన్ కు కారణం ఏంటంటే..?

August 31, 2022 10:02 PM

Rana Daggubati : టాలీవుడ్ ను శాసిస్తున్న కుటుంబాల గురించి అందరికీ తెలిసిందే.. అయితే సినిమాల విషయంలో ఆ కుటుంబాల మధ్య పోటీ ఉన్నప్పటికీ ఫ్యామిలీ మ్యాటర్ కి వచ్చేసరికి అంతా ఒక్కటే అన్నట్టు వరుసలు కలుపుకు తిరుగుతారు. అలా టాలీవుడ్‌లో అక్కినేని, నంద‌మూరి, ద‌గ్గుబాటి ఫ్యామిలీల‌ది ఐదారు ద‌శాబ్దాల అనుబంధం. ఈ మూడు కుటుంబాల మ‌ధ్య అనుబంధం చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఆ మాట‌కు వస్తే ఏఎన్నార్ – రామానాయుడు ఏకంగా వియ్యంకులే అయ్యారు. అలాగే ఇటు ద‌గ్గుబాటి, నంద‌మూరి, నంద‌మూరి, అక్కినేని ఫ్యామిలీ బంధాలు కూడా బాగానే ఉన్నాయి. అయితే నంద‌మూరి, ద‌గ్గుబాటి వంశాల్లో మూడో త‌రం హీరోలుగా జూనియ‌ర్ ఎన్టీఆర్‌, రానా కొన‌సాగుతున్నారు.

బాహుబ‌లితో రానా, ఆర్ఆర్ఆర్ తో ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్లు అయిపోయారు. వీరిద్దరూ పాన్ ఇండియా స్టార్స్ అయినప్పటికీ ఎక్కడా ఫ్యాన్స్ ని రెచ్చగొట్టడం, ఈగోలకి వెళ్లడం లాంటివి ఎప్పుడు చేయలేదు. ఎంత ఎదిగినా ఒదిగి ఉన్నారని చెప్పొచ్చు. ఇండస్ట్రీలో ఫ్యాన్ వార్ తీవ్రంగా ఉన్నప్పటికీ ఎన్టీఆర్, రానా సింపుల్ గా ఉండడంతో వీరి ఫ్యాన్స్ కూడా వివాదాలకు దూరంగా ఉన్నారు. అయితే వ్య‌క్తిగ‌తంగా రానా, ఎన్టీఆర్ మంచి ఫ్రెండ్స్‌ అని మనకు తెలిసిందే. అంతేకాదు ఒక‌రినొక‌రు బావ‌, బావ అని పిలుచుకుంటూ ఉంటారు. సురేష్‌బాబును ఎన్టీఆర్ ముద్దుగా మావా అని పిలుస్తుంటాడు.

Rana Daggubati and Jr NTR are brother in laws what is the relation
Rana Daggubati

ఎన్టీఆర్ హోస్ట్ గా ఉన్న మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు ప్రోగ్రామ్‌కు ఓసారి రామ్‌చ‌ర‌ణ్ గెస్ట్ గా వ‌చ్చాడు. ఫోన్ ఇన్ ఫ్రెండ్ కాల్‌కు చ‌ర‌ణ్ రానాకే ఫోన్ చేశాడు. ఫోన్ క‌లిసిన వెంట‌నే రానా, ఎన్టీఆర్ ఒక‌రినొక‌రు బావ‌, బావ అని పిలుచుకున్నారు. బావ మీ ఎపిసోడ్ మేకింగ్ వీడియో ఏకంగా 10 సార్లు చూశాన‌ని.. తాను మెస్మరైజ్ అయిపోయాన‌ని రానా చెప్ప‌గా.. వెంట‌నే తార‌క్ థ్యాంక్యూ బావా అని రానాకు అప్యాయంగా చెప్పాడు. ఇక బ‌య‌ట కూడా రానా, ఎన్టీఆర్ మ‌ధ్య మంచి బాండింగ్ ఉంది. ఇండస్ట్రీలో స్టార్ హీరోల మధ్య మంచి రిలేషన్ ఉండడం వల్ల ఫ్యాన్స్ కూడా బాగా ఖుషి అవుతున్నారు. పాన్ ఇండియా హీరోలైనప్పటికీ ఒద్దికగా ఉండి, మంచి బాండింగ్ మెయింటైన్ చేస్తున్నందుకు రానా, ఎన్టీఆర్ ల‌ను అభినందించాల్సిందే.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now