Isha Koppikar : ఆ హీరో ఫోన్ చేసి ఒంట‌రిగా గ‌దికి రమ్మ‌న్నాడు.. ఈషా కొప్పిక‌ర్ సంచ‌ల‌న కామెంట్స్‌..

August 31, 2022 3:19 PM

Isha Koppikar : ప్రస్తుతకాలంలో చిత్ర పరిశ్రమ ఏదైనా సరే క్యాస్టింగ్ కౌచ్ అన్న‌ది కామ‌న్ విషయం అయిపోయింది. ఒకప్పుడు సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉన్నా అది కేవ‌లం నాలుగు గోడలకు మాత్రమే పరిమితమై ఉండేది. అయితే ఇప్పుడు ప‌రిస్థితి మారిపోయిందని చెప్ప‌వచ్చు. మీ టూ ఉద్య‌మాలు వెలుగులోకి రావ‌డంతో ఎవ్వ‌రూ కూడా వెన‌క్కు త‌గ్గ‌డం లేదు. ఇక ప్రస్తుతం కాస్టింగ్ కౌచ్ అనేది పెద్ద ఉద్య‌మంగా మారిపోయింది.

ఎక్కువగా ఆఫర్లు రాని చిన్నా చిత‌కా హీరోయిన్లు మాత్రమే కాస్టింగ్ కౌచ్ పై స్పందిస్తూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కాస్టింగ్ కౌచ్ అనేది ఇండస్ట్రీని పట్టి పీడిస్తున్న  భూతం అనే చెప్పాలి. ఒకప్పటి అగ్ర స్థాయి హీరోయిన్ల‌ నుంచి ఇప్పటి అందాల తారల‌ వరకూ కాస్టింగ్ కౌచ్ వల్ల ఇబ్బంది పడినవాళ్లు ఎంతో మంది ఉన్నారు. అయితే ఆ లిస్ట్ లో నేను కూడా ఒకరిని అని హీరోయిన్ ఈషా కొప్పికర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

Isha Koppikar sensational comments on a hero when her career beginning
Isha Koppikar

ఈషా కొప్పికర్ 1998లో ఎక్ థా దిల్ థా ధ‌డ్కన్ చిత్రంతో వెండి తెరకు పరిచయం అయ్యింది. అదే సంవత్సరంలో చంద్రలేఖ చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. వెంకటేష్ నటించిన ప్రేమతో రా చిత్రంలో కూడా గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చింది. తన అందం అభినయంతో ఎన్నో చిత్రాల్లో నటించి మంచి గుర్తింపుతోపాటు ఎంతో మంది అభిమానుల‌ను కూడా సంపాదించుకుంది. ఆ ఇంటర్వ్యూలో తాను చదువుకునే రోజుల్లో పాకెట్ మనీ కోసం తాను మోడలింగ్ చేశానని ఇషా వెల్లడించడం జరిగింది. మోడలింగ్ చేసే టైంలోనే నాకు సినిమా అవకాశాలు రావడం ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే ఎక్ థా దిల్ థా ధ‌డ్కన్ అనే సినిమాలో అవకాశం రాగా అందులో నటించానని చెప్పకొచ్చింది.

ఈ సినిమాలో నటించిన తర్వాత ఓ నిర్మాత ఫోన్ చేసి ఒక అవకాశం ఉంది అని చెప్పారు. అయితే ముందుగా హీరోను కలవాలి అని కండిషన్ పెట్టారని తెలిపింది. ఆ తరవాత తాను హీరోకు ఫోన్ చేయగా మీరు మాత్రమే ఒంటరిగా రండి. మీతో ఎవరినీ తీసుకుని రావద్దు. ఏకాంతంగా కలుద్దాం అంటూ పచ్చిగా మాట్లాడాడు అని ఆవేదన వ్యక్తం చేసింది ఈషా.

ఈ సంఘటనతో నేను వెంటనే సదరు నిర్మాతకు ఫోన్ చేసి నేను టాలెంట్ ను నమ్ముకుని ఇండస్ట్రీకి వచ్చా అని చెప్పానని తెలిపింది. నా టాలెంట్ కు అవకాశాలు వస్తే సినిమాలు చేస్తా లేదంటే లేదు అని మొహమాటం లేకుండా చెప్పేశాను. ఆ తరవాత ఆ ప్రాజెక్ట్ నుండి నన్ను తొలగించారు అని తెలిపింది. ఇండ‌స్ట్రీలో చాలా మంది హీరోయిన్లుగా రాణించడానికి రాజీ ప‌డుతున్నార‌ని కూడా చెప్పింది. ఇంతకూ తనను ఇబ్బంది పెట్టిన ఆ హీరో, నిర్మాత ఎవరు అనే విషయం మాత్రం బయటకు చెప్పలేదు. మరలా ఈషా 2017లో కేశవ చిత్రంతో తెలుగు తెరపై తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ప్రస్తుత ఈషా హిందీ, తమిళ చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now