Puri Jagannadh : లైగ‌ర్ దెబ్బ‌కి పూరీకి అప్పుడే రెండు భారీ షాక్‌లు..!

August 26, 2022 7:58 PM

Puri Jagannadh : రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ, అనన్య పాండే జంటగా నటించిన చిత్రం లైగర్. భారీ అంచనాల మధ్య ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు విపరీతమైన బజ్‌ క్రియేట్‌ అయ్యింది. కానీ సినిమా మాత్రం అనుకున్నంతగా ఆడియెన్స్‌ను మెప్పించలేకపోయింది. దీంతో బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్స్‌ పరంగానూ నిరాశపరిచింది. లైగ‌ర్ సినిమాకు ప్రీమియ‌ర్ షోల నుంచే నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అయిపోయింది. లైగర్.. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, పూరీ జ‌గ‌న్నాథ్ డై హార్డ్‌ ఫ్యాన్స్‌కే ఏ మాత్రం న‌చ్చ‌డం లేదు.

ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాకు ముందు పూరీకి వ‌రుస ఫ్లాపులే ఉన్నాయి. ఆ సినిమాతో ఫామ్‌లోకి వ‌చ్చిన పూరీ లైగ‌ర్‌తో దానిని కంటిన్యూ చేస్తాడ‌నే అనుకున్నారు. కానీ రొటీన్ కథతో నిరాశ పరిచాడు. అయితే ఇప్పుడు లైగ‌ర్ త‌ర్వాత వెంట‌నే పూరీ విజ‌య్‌తోనే జ‌న‌గ‌ణ‌మ‌న సినిమా స్టార్ట్ చేసేశాడు. నిజానికి ఇది మ‌హేష్‌బాబు కోసం రాసుకున్న క‌థ‌. మ‌హేష్ ఆ స్టోరీని రిజెక్ట్ చేయడంతో విజ‌య్‌తో పాన్ ఇండియా సినిమాగా చేస్తున్నాడు. విజయ్ లైగ‌ర్ రిజ‌ల్ట్ రాకుండానే పూరీతో మరో సినిమా చేసేందుకు ఓకే చెప్పేశాడు. క‌ట్ చేస్తే లైగ‌ర్.. విజ‌య్, పూరీ కెరీర్ లోనే చెత్త సినిమాగా మిగిలిపోయింది.

Puri Jagannadh got disappointment with Liger movie
Puri Jagannadh

లైగ‌ర్ సినిమాను భారీ రేట్ల‌కు కొన్న బ‌య్య‌ర్లు భారీగా న‌ష్ట‌పోవ‌డం ఖాయ‌మ‌నే అంటున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో విజ‌య్ జ‌న‌గ‌ణ‌మ‌న చేయ‌డ‌నే టాక్ వినిపిస్తోంది. అదే నిజమైతే పూరీకి గట్టి దెబ్బ తగిలినట్టే. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం విజయ్.. స‌మంత‌తో చేస్తోన్న ఖుషి మూవీని పూర్తి చేస్తూ జ‌న‌గ‌ణ‌మ‌న‌కు బ్రేక్ ఇచ్చేసిన‌ట్టే అంటున్నారు. ఇక విజ‌య్ జ‌న‌గ‌ణ‌మ‌న ఆపేయ‌డం పూరీకి ఒక షాక్ అయితే.. ఇప్ప‌టికే లైగ‌ర్ క్రేజ్ చూసి పూరీ నెక్స్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ ఇస్తాడ‌ని అడ్వాన్స్‌లు ఇచ్చినోళ్లు కూడా ఇప్ప‌ట్లో పూరీతో సినిమాలు చేసే ఛాన్స్ లేదు. ఏదేమైనా టెంప‌ర్‌కు ముందు వ‌రుస ఫ్లాపులు.. టెంప‌ర్ త‌ర్వాత వ‌రుస ఫ్లాపుల‌తో పూరీని ఎవ్వ‌రూ ప‌ట్టించుకోలేదో ఇప్పుడూ అదే ప‌రిస్థితి వ‌చ్చేలా ఉంది. మ‌రి ముందు ముందు ఏమ‌వుతుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment