Venu Thottempudi : నటుడు వేణు భార్య ఎవరో తెలుసా.. ఆమె ఇప్పుడు ఏమి చేస్తుందంటే..?

August 29, 2022 2:13 PM

Venu Thottempudi : రెండు దశాబ్దాల క్రితం స్వయంవరంతో ఫిల్మ్ ఎంట్రీ ఇచ్చాడు వేణు తొట్టెంపూడి. అటు యూత్ ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ సంపాదించుకున్నాడు వేణు. హీరోగా చేసింది కొన్ని సినిమాలే అయినా కమర్షియల్ ఫార్ములాకి దూరంగా క్లీన్ ఎంటర్ టైనర్స్ లో నటించాడు. ముఖ్యంగా చిరునవ్వుతో క్యారెక్టరైజేషన్ ఇప్పటికీ మంచి వ్యక్తిత్వ వికాసానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. స్వయంవరం, పెళ్ళాం ఊరెళితే, హనుమాన్ జంక్షన్ ఎప్పుడు టీవీలో వచ్చినా హ్యాపీగా ఇంటిల్లిపాదీ చూసి ఎంజాయ్ చేస్తారు.

ముఖ్యంగా వేణు కామెడీ టైమింగ్ కు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ తర్వాత వరుస ఫ్లాపులతో వేణు సినిమాలకు మాయమయ్యాడు. ఆ తరువాత దాదాపు పది ఏళ్ళు అవుతున్నా మళ్ళీ తెరపై కనిపించలేదు. 2012లో తిరిగి దమ్ములో కనిపించాడు కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే ఇటీవల వేణు.. రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ లో పోలీస్ గా కనిపించాడు. ఇదిలా ఉండ‌గా ఇప్పుడు వేణు భార్య, పిల్లల గురించి తెలుసుకోవడానికి అంతా ఆసక్తి చూపిస్తున్నారు.

do you know what Venu Thottempudi wife does
Venu Thottempudi

అయితే తన భార్య పిల్లల గురించి పరిచయం చేయకపోవటానికి పెద్దగా రీజన్స్ ఏమీ లేవని అన్నారు వేణు. వేణు భార్య పేరు అనుపమ చౌదరి. ఆమె యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ లో ఎంబీఏ పూర్తి చేసిందట. అలాగే ఇంటీరియర్ డిజైనింగ్‌లో ట్రైనింగ్ కూడా తీసుకుందట అనుపమ. వేణు, అనుపమ ఇద్దరి మధ్య బంధుత్వం ఉంది. అందుకే ఇష్టపడి పెళ్లి చేసుకున్నారట. వీరి వివాహం జరిగి 10 ఏళ్ళు పైనే అయ్యింది. వీరికి ఒక పాప, బాబు ఉన్నారు. బిజినెస్ లో బిజీగా ఉండటంతో వేణు సినిమాలకు దూరమయ్యారట. తన భార్య సపోర్ట్ తోనే అటు ఫ్యామిలీని, ఇటు బిజినెస్ ను బ్యాలెన్స్ చేస్తున్నాన‌ని చెప్పుకొచ్చారు వేణు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment