Sai Pallavi : సాయిప‌ల్ల‌వి ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్‌.. షాకింగ్ నిర్ణ‌యం తీసుకున్న లేడీ ప‌వ‌ర్ స్టార్‌..?

August 27, 2022 1:09 PM

Sai Pallavi : సాయిప‌ల్ల‌వి.. ఫిదా మూవీతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టి తన న‌ట‌న‌తో అంద‌రినీ ఫిదా చేసింది. సినీ గ్లామర్ ప్రపంచంలో ఎంత పెద్ద హీరోయిన్ అయినప్పటికీ స్కిన్ షో తప్పదు. వీటికి దూరంగా ఉంటూ తన నటన ద్వారా అభిమానులను సొంతం చేసుకున్న సహజ నటి సాయి పల్లవి. హీరోలకు ఏ మాత్రం తీసిపోని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ కూడా సాయి పల్లవే. కేవలం స్క్రీన్ పై ఆమెను చూడటానికే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు. సాయి పల్లవిని టాలీవుడ్ లేడీ పవర్ స్టార్ అని ముద్దుగా పిలుస్తారు.

ఇటీవల సాయి పల్లవి నటించిన విరాట పర్వం, గార్గి థియేటర్ లో కలెక్టన్స్ రాబట్ట లేకపోయినా.. పల్లవి నటనకు మాత్రం మంచి గుర్తింపు లభించింది. అయితే ఇప్పుడు సాయి పల్లవి గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముందు నుంచి సాయి పల్లవి కథల‌ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. తనకు కథ నచ్చకపోతే అవతల వ్యక్తి స్టార్ హీరో అయినా సరే.. ఆ మూవీను రిజెక్ట్ చేస్తుంది సాయి పల్లవి. కానీ ఈసారి మాత్రం సాయి పల్లవి తప్పు చేసిందనే చెప్పాలి.

Sai Pallavi may not act in movies anymore what is the reason
Sai Pallavi

ఎందుకంటే లేడీ ఓరియెంటెడ్ స్టోరీతో ఓ యంగ్ డైరెక్టర్ సాయి పల్లవిని మీట్ అయితే ఈ అమ్మ‌డు సున్నితంగా రిజెక్ట్ చేసిందట. అలాగని సినిమాలో వల్గర్ సీన్స్ లేవు.. సినిమా కథ కూడా మెసేజ్ ఓరియెంటెడ్ అంటా.. అయినా కూడా సాయి పల్లవి ఎందుకు రిజెక్ట్ చేసిందో తెలుసా..? ఈ మధ్యకాలంలో సాయి పల్లవి నటించిన వరుస సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో ప్రొడ్యూసర్స్ కి నష్టాలు వచ్చాయి. దీంతో సాయి పల్లవి ఇక సినిమాలకు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.

తన మనసు చంపుకుని ఇష్టం లేని సినిమాల్లో నటించనని.. అలా అని నా పద్ధతులతో నిర్మాతలకు నష్టం తీసుకురావడం ఇష్టం లేదు అంటూ.. తన దగ్గరకు వచ్చిన మంచి స్టోరీని సాయి పల్లవి రిజెక్ట్ చేసిందట. అంతే కాదు ఆ డైరెక్టర్ తో.. మీరు నాపై చూపించిన ప్రేమకు, అభిమానానికి చాలా థాంక్స్. కానీ నేను ఇకపై సినిమాల‌లో నటించాలి అనుకోవడం లేదు అంటూ భారీ ఆఫర్ ను రిజెక్ట్ చేసిందట. ఈ సినిమా కోసం రూ.2 కోట్లు ఆఫర్ చేశారట. అయినప్పటికీ సాయి పల్లవి సున్నితంగా తిరస్కరించింది. ఈ సినిమాను రిజెక్ట్ చేయడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఇది హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now