Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవికి ఉన్న ఆస్తుల విలువ ఎంతో తెలుసా..? దిమ్మ తిరిగి పోతుంది..!

August 23, 2022 7:36 PM

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి చేసిన సినిమాల గురించి కానీ ఆయ‌న చేసే సేవా కార్య‌క్ర‌మాల గురించి కానీ తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప్ర‌త్యేకంగా వివ‌రించాల్సిన అవ‌స‌రం లేదు. గ‌త 4 ద‌శ‌బ్దాలుగా తెలుగు సినీ ఇండ‌స్ట్రీనీ ఏలుతున్న న‌టుడు ఆయ‌న‌. ఈ 40 సంవ‌త్స‌రాల‌లో ఆయ‌న న‌టించిన సినిమాల‌కు గాను ఎన్నో అవార్డుల‌ను అందుకోవ‌డ‌మే కాకుండా ఎన్నో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. అయితే ఈ విష‌యాల‌న్నీ మ‌న‌లో చాలా మందికి తెలిసిన‌వే. కానీ ఇన్ని ఏళ్ల‌లో ఆయ‌న సంపాదించిన స్థిర చ‌రాస్తుల గురించి గానీ వాటి విలువ గురించి గానీ మ‌న‌లో చాలా త‌క్కువ మందికి మాత్ర‌మే తెలుసు.

మెగాస్టార్ చిరంజీవి ఈ ఆగ‌స్టు 22కి 67 సంవత్స‌రాలు పూర్తి చేసుకున్నారు. ఇక ఈయ‌న మొత్తం ఆస్తుల విలువ రూ.1500 కోట్లుగా తెలుస్తోంది. ఈయ‌న స్థిరాస్తుల వివ‌రాల్లోకి వెళితే.. అత్యంత‌ ఖ‌రీదైన స్థ‌లాలు ఉండే జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఈయ‌న‌కు ఉన్న విలాస‌వంత‌మైన ఇల్లు అర ఎక‌రం పైగానే ఉంటుంది. దీని విలువ‌ దాదాపు రూ.30 కోట్లు ఉంటుంద‌ని అంచనా. అంతే కాకుండా చెన్నై లో ఉన్న ఇంటి విలువ రూ.2 కోట్లు. ఇంకా ఈ మ‌ధ్య‌నే బెంగుళూరు లో కొన్న ఇంటి విలువ రూ.28 కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ని స‌మాచారం. ఇంకా బెంగ‌ళూరు, చెన్నై ల‌లో రూ.13 కోట్లు విలువ చేసే ఫామ్ హౌస్ లు కూడా ఉన్నాయి.

do you know about Chiranjeevi assets value
Chiranjeevi

ఇంకా చ‌రాస్తులు తీసుకుంటే ఈయ‌న‌కు రూ.10 కోట్లు విలువ చేసే రోల్స్ రాయిస్ కారు, రూ.2.50 కోట్లు విలువ చేసే 2 టొయోటా ల్యాండ్ క్రూజ‌ర్ కార్లు, రూ.4 కోట్లు విలువ చేసే 2 రేంజ్ రోవ‌ర్ కార్లు ఉన్నాయి. ఇంకా ఆయ‌న భార్య పేరుమీద రూ.90 కోట్లు విలువ చేసే ఆస్తులు ఉన్నాయి.

ఇక తెలుగు సినిమాల్లో అత్య‌ధిక రెమ్యున‌రేష‌న్ తీసుకునే స్టార్ల‌లో చిరంజీవి గారు ఒక‌రు. ఈయ‌న ఒక సినిమాకి గాను రూ.40 నుండి రూ.50 కోట్లు తీసుకుంటార‌ని తెలిసింది. అంతే కాకుండా సినిమాపై వ‌చ్చే లాభాల్లో షేర్ కూడా వ‌స్తుంది. అలాగే మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు టీవీ షో చేయ‌డానికి గాను ఈయ‌నకు ఒక్కో ఎపిసోడ్ కి రూ.10 ల‌క్ష‌లు అందాయి. ఇంకా వ్యాపార ప్ర‌క‌ట‌నల‌ ద్వారా కూడా ఈయ‌న‌కు పెద్ద మొత్తంలో ఆదాయం వ‌స్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment