Viral Photo : ఈ ఫోటోలోని చిన్నారి టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా..?

August 20, 2022 3:29 PM

Viral Photo : గత కొంతకాలంగా హీరో, హీరోయిన్లు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. అంతే కాకుండా అభిమానులతో లైవ్ చాట్ చేస్తూ టచ్ లో ఉంటున్నారు. తమకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను, అరుదైన ఫోటోలను షేర్ చేయడమే కాకుండా.. లైవ్ వీడియోల ద్వారా అభిమానుల సందేహాలకు సమాధానాలు ఇస్తున్నారు. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తన చిన్ననాటి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఛలో సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్న గీత గోవిందం సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమా తర్వాత రష్మికకు తెలుగులో వరుసగా ఆఫర్లు క్యూ కట్టాయి. దాదాపు టాలీవుడ్ టాప్ హీరోలందరితోనూ నటించే చాన్స్ దక్కించుకుంది ఈ కన్నడ భామ‌. ఇటీవల ఈ అమ్మడు అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కిన పుష్ప సినిమాలోనూ నటించింది.

Viral Photo have you found Rashmika Mandanna in this one
Viral Photo

పుష్పతో ఒక్కసారిగా రష్మిక రేంజ్ మారిపోయింది. ఇదే క్రమంలో నేషనల్ క్రష్ గా మారిపోయింది రష్మిక మందన్న. బాలీవుడ్‌లో గుడ్ బై, మిషన్ మజ్ను సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ అమ్మడు తన ఇన్ స్టా గ్రామ్ లో చిన్ననాటి ఫోటోను షేర్ చేసింది. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అలాగే రష్మిక వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారసుడులో నటిస్తోంది. ఈ మూవీ హీరో తమిళ తలపతి విజయ్ కాగా దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now