Sita Ramam : సీతారామం సినిమాని మిస్ చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరోలు ఎవరో తెలుసా..?

August 20, 2022 7:15 AM

Sita Ramam : టాలీవుడ్ కి ఆగస్టు నెల బాగా కలిసొచ్చిందని చెప్పొచ్చు. బింబిసార, సీతారామం, కార్తికేయ 2 సినిమాలు సూపర్ సక్సెస్ ని సొంతం చేసుకున్నాయి. ఇందులో సీతారామం మూవీ విషయానికి వస్తే ఇందులో దుల్కర్‌ సల్మాన్‌, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటించారు. రష్మిక మందన్నా, సుమంత్‌ ముఖ్య పాత్రలు పోషించారు. అశ్వినీదత్‌ నిర్మించిన ఈ సినిమాకు హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మోడర్న్ కల్ట్ క్లాసిక్ గా నిలవడంతో తెలుగు ప్రేక్షకులు తనపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు దుల్కర్‌.

అయితే ఈ చిత్ర దర్శకుడు హను రాఘవపూడికి ఈ చిత్రానికి ముందు అన్ని ఫ్లాపులే ఉన్నాయి. దీనితో హను రాఘవపూడితో సినిమాలు చెయ్యడానికి మన క్రేజీ హీరోలెవరూ ఆసక్తి చూపించలేదు. దీంతో సీతారామం మూవీ స్టోరీ దుల్కర్‌ కంటే ముందు ఇద్దరు, ముగ్గురు స్టార్ హీరోల దగ్గరకు వెళ్లిందంటూ ఇండస్ట్రీలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. మొదట ఈ స్క్రిప్ట్‌ను రౌడీ బాయ్ హీరో విజయ్‌ దేవరకొండకు వినిపిస్తే అతడికి పెద్దగా నచ్చలేదని హను రాఘవపూడి ఒకానొక సందర్భంలో వెల్లడించాడు. అయితే రౌడీ హీరో కాకుండా మరో ఇద్దరు హీరోలు కూడా సీతారామం చిత్రాన్ని రిజెక్ట్‌ చేశార‌ట. వాళ్లు మరెవరో కాదు.. న్యాచురల్ స్టార్ నాని, ఎనర్జిటిక్ హీరో రామ్‌ పోతినేని. ఇద్దరూ ప్రేమకథా చిత్రాలు తీయడంలో దిట్ట. కానీ వీళ్ళు ఎందుకో సీతారామం సినిమా విషయానికి వచ్చేసరికి డేట్స్ సర్దుబాటు కాలేకనో, లేకపోతే కెరీర్ మంచి ఊపు లో ఉన్న సమయంలో ఫ్లాప్ డైరెక్టర్ తో సినిమా చేసి రిస్క్ చెయ్యడం ఎందుకనో తెలీదు.. ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకోలేదు.

do you know who missed Sita Ramam movie
Sita Ramam

ఇక ఈ సినిమాలో సీత పాత్ర కోసం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే కోసం ప్రయత్నం చేశాడు హను. కానీ ఆమె కూడా ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకోలేదట. ఆ తర్వాత దుల్కర్ సల్మాన్ కి ఈ కథ చెప్పగానే వెంటనే నచ్చి ఓకే చేసేశాడు. అలా తెరకెక్కిన సీతారామం సినిమా నేడు టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దీంతో ఇప్పటి వరకు డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉన్న దుల్కర్ డైరెక్ట్ తెలుగు చిత్రంతో మరింత దగ్గరయ్యాడు. ఇప్పుడు టాలీవుడ్ లో దుల్కర్ కి మంచి మార్కెట్ ఏర్పడింది. ఈ సినిమానే మన హీరోలు చేసుంటే వారి కెరీర్ నెక్స్ట్ లెవెల్ లో ఉండేది. వారి బ్యాడ్ లక్ ఇప్పుడు బాధపడి మాత్రం ఏం లాభం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment