Bandla Ganesh : ప‌వ‌న్‌పై బండ్ల గ‌ణేష్ ఇన్‌డైరెక్ట్ కామెంట్స్‌.. మండిపడుతున్న ఫ్యాన్స్‌..

August 17, 2022 11:06 AM

Bandla Ganesh : బండ్ల గ‌ణేష్.. ఒక న‌టుడిగా, నిర్మాత‌గా, వ్యాపార వేత్త‌గా అంద‌రికీ తెలుసు. కానీ ఈయ‌న గ‌త కొంత కాలంగా హీరో ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప‌ర భ‌క్తుడిగానే ఎక్కువ‌గా వార్త‌ల్లో నిలుస్తున్నాడు. త‌నని తాను ప‌వ‌న్ వీరాభిమానిగా చెప్పుకుంటూ ఉంటాడు. వివిధ వేడుక‌ల్లో అవ‌కాశం దొరికిన‌ప్పుడ‌ల్లా త‌న విచిత్ర‌మైన మాట‌ల‌తో, హావ భావాల‌తో ప్ర‌సంగిస్తూ, త‌న అభిమాన న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ని త‌ర‌చూ పొగ‌డ్త‌ల‌తో ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటాడు. ఇక ఈయ‌న ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో చివ‌ర‌గా గ‌బ్బ‌ర్ సింగ్ సినిమాని నిర్మించాడు. ఇది అప్ప‌ట్లో సూప‌ర్ హిట్ గా నిలిచింది.

అయితే చాలా రోజులుగా ప‌వ‌న్ అభిమానులు బండ్ల గ‌ణేష్ ని త‌మ హీరో ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో త‌న త‌దుప‌రి చిత్రాన్ని ఎప్పుడు తీస్తారని స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా అడుగుతూ వ‌స్తున్నారు. ఇప్పుడిక ఇదే ప్రశ్న‌ని ఒక ప‌వ‌న్ అభిమాని ట్విట్ట‌ర్ వేదిక‌గా బండ్ల గ‌ణేష్ ని అడ‌గ‌డం జ‌రిగింది. దానికి ఆయ‌న ఆ అభిమానికి నీతి సూక్తులు బోధించ‌గా అవి కాస్తా ఇప్పుడు ప‌వ‌న్ అభిమానుల‌కి కోపం తెప్పించేలా ఉన్నాయి. వారు ఈ విష‌యంలో ఆయ‌న‌పై మండి ప‌డుతున్నారు.

Bandla Ganesh indirect comments on Pawan Kalyan fans angry
Bandla Ganesh

బండ్ల గ‌ణేష్ ఆ అభిమాని ట్వీట్ కి బ‌దులిస్తూ.. మ‌నం నిజంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానులం అయితే సినిమాలంటూ వెంట‌ప‌డి ఆయ‌న‌ని డిస్ట‌ర్బ్ చేయ‌కూడ‌ద‌ని, ఆయ‌న ఇప్పుడు ఏం చేస్తున్నాడో అది చేయ‌నివ్వాల‌ని అన్నాడు. ఇంకా ప‌వ‌న్ క‌ళ్యాణ్ లాంటి వ్య‌క్తి స్థాయి వేర‌ని, ఎంతో భిన్న‌మైన వ్య‌క్తిత్వం ఉన్న‌ మ‌నిషి అని చెప్పాడు. ఇక బండ్ల గ‌ణేష్ చెప్పిన ఈ మాట‌లు అర్థం లేనివ‌ని ప‌వ‌న్ అభిమానులు ఆయ‌న‌పై విరుచుకు ప‌డుతున్నారు.

అయితే ఆ అభిమాని బండ్ల గ‌ణేష్ ట్వీట్ కి బ‌దులుగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో నెక్ట్స్ మూవీ ఎప్ప‌డు చేస్తావ్ అని అడిగితే ఏవో విష‌యాలు చెప్ప‌డం ఏంట‌ని, త‌మ హీరోతో సినిమా చేస్తా అని గానీ చేయ‌ను అని కానీ ఏదో ఒక‌టి చెప్తే స‌రిపోతుంది క‌దా, అవ‌స‌రం లేని నీతి సూక్తులు ఎందుకు చెబుతున్నావ్.. అని కాస్త‌ ఘాటుగానే స్పందించాడు. ఇప్ప‌టికైనా బండ్ల త‌న తీరుని మార్చుకుంటాడో.. లేదో.. చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now