Venu Swamy : ప్ర‌భాస్‌పై వేణు స్వామి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. ఉద‌య్ కిర‌ణ్‌కి ప‌ట్టిన గ‌తే ప‌డుతుంద‌ట‌..

August 17, 2022 10:12 AM

Venu Swamy : బాహుబలి చిత్రంతో ప్రభాస్ తన నటనా ప్రతిభతో ఒక్కసారిగా అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు. సక్సెస్ తో సంబంధం లేకుండా వరుస పాన్ ఇండియా చిత్రాలను చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇదంతా ఒక మాట అయితే ఎప్పుడూ ప్రభాస్ గురించి ఒక విషయం సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంటుంది. త్వరలోనే ప్రభాస్ వివాహం అంటూ ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. 40 ఏళ్ళు దాటినా ఇప్పటికి కూడా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ బాగానే ఉన్నాడు ప్రభాస్. అభిమానులు సైతం పెళ్లి వార్త విని ఎంతో సంబరపడిపోతూ ఉండేవారు. కానీ ఆ వార్తలన్నీ కలలుగానే ఉంటున్నాయి.

ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ప్రభాస్ అభిమానులను కలవరపరుస్తోంది. తాజాగా సెలబ్రిటీలకు జాతకాలు చెప్పే వేణు స్వామి ప్రభాస్ అభిమానుల గుండెలు గుభేల్ అనే ఈ విధంగా ఒక పెద్ద బాంబ్ పేల్చారు. నేను ఇప్పటివరకు  సెలబ్రిటీలకు చెప్పిన జ్యోతిష్యం ఎప్పుడూ తప్పు కాలేదు. నేను చెప్పింది చెప్పినట్లు జరుగుతుంది అంటూ వేణు స్వామి ఎన్ని కొత్త విషయాలు ప్రభాస్ గురించి వెల్లడించారు.   నాలుగు పదుల వయసు దాటినా ప్రభాస్ ఇంకా పెళ్లి చేసుకోక‌పోవడానికి కారణం అతని జాతకంలో దోషం ఉండ‌డ‌మే అని, అందుకే ఆయనకు పెళ్లి కాకుండా ఆలస్యం అవుతుంద‌ని చెప్పారు.

Venu Swamy sensational comments on Prabhas marriage
Venu Swamy

ఒకవేళ కష్టాలను అధిగమించి పెళ్లి చేసుకున్నట్లయితే.. హీరో ఉదయ్ కిరణ్ కి పట్టిన గతే పడుతుంద‌ట‌. జీవితం సగంలోనే సూసైడ్ చేసుకుంటాడ‌ట‌. అందుకే ప్రభాస్ పెళ్లి చేసుకోక‌పోవడమే మంచిది అంటూ బల్ల గుద్ధి చెప్పారు వేణు స్వామి. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now