గెలాక్సీ ఎస్‌20 ఎఫ్ఈ 5జి వేరియెంట్ విడుద‌ల‌.. ఫీచ‌ర్లు, ధ‌ర వివ‌రాలు..

March 31, 2021 2:33 PM

ప్ర‌ముఖ ఎల‌క్ట్రానిక్స్ త‌యారీదారు శాంసంగ్ త‌న గెలాక్సీ ఎస్‌20 ఎఫ్ఈ (ఫ్యాన్ ఎడిష‌న్‌) స్మార్ట్‌ఫోన్‌కు గాను 5జి వేరియెంట్‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. ఇందులో 6.5 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన సూపర్ అమోలెడ్ ఇన్పినిటీ-ఓ ఫ్లాట్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. ఇందులో స్నాప్‌డ్రాగ‌న్ 865 ప్రాసెస‌ర్ ఉంది. 5జికి స‌పోర్ట్ ల‌భిస్తుంది. 8జీబీ ర్యామ్ పొందుతారు. ఇన్‌డిస్‌ప్లే ఆప్టిక‌ల్ ఫింగ‌ర్ ప్రింట్ స్కాన‌ర్ ఉంది. ఆండ్రాయిడ్ 11 ఓఎస్ ల‌భిస్తుంది.

Samsung Galaxy S20 FE 5G variant launched in india

ఈ ఫోన్ వెనుక భాగంలో 12 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరాకు తోడుగా మ‌రో 12 మెగాపిక్స‌ల్ అల్ట్రా వైడ్ లెన్స్‌, 8 మెగాపిక్స‌ల్ టెలిఫోటో లెన్స్‌ను ఏర్పాటు చేశారు. ముందు భాగంలో 32 మెగాపిక్స‌ల్ కెమెరా ఉంది. ఈ ఫోన్‌కు ఐపీ 68 వాట‌ర్‌, డ‌స్ట్ రెసిస్టెన్స్ ఫీచ‌ర్‌ను అందిస్తున్నారు. 4500 ఎంఏహెచ్ బ్యాట‌రీ ఉంది. దీనికి 25 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ ఫీచ‌ర్‌ను అందిస్తున్నారు. వైర్‌లెస్ చార్జింగ్‌కు స‌పోర్ట్ ల‌భిస్తుంది.

శాంసంగ్ గెలాక్సీ ఎస్‌20 ఎఫ్ఈ 5జి ఫీచ‌ర్లు

  • 6.5 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ సూప‌ర్ అమోలెడ్ ఇన్ఫినిటీ-ఓ డిస్‌ప్లే
  • 2400 × 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్
  • ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 865 ప్రాసెస‌ర్‌, 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్
  • 1 టీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 11 ఓఎస్, హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్
  • 12, 8, 12 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు, 32 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరా
  • ఐపీ 68 వాట‌ర్‌, డ‌స్ట్ రెసిస్టెన్స్‌, డాల్బీ అట్మోస్‌, ఆప్టిక‌ల్ ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్
  • 5జి, డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్‌సీ
  • 4500 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌, వైర్‌లెస్ చార్జింగ్

శాంసంగ్ గెలాక్సీ ఎస్‌20ఎఫ్ఈ 5జి స్మార్ట్ ఫోన్ క్లౌడ్ లావెండ‌ర్‌, క్లౌడ్ మింట్‌, క్లౌడ్ నేవీ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో విడుద‌లైంది. ఈ ఫోన్ అస‌లు ధ‌ర రూ.55,999. కానీ లాంచింగ్ ఆఫ‌ర్ కింద రూ.47,999 ధ‌ర‌కే దీన్ని అందిస్తున్నారు. శాంసంగ్ ఆన్‌లైన్ స్టోర్, అమెజాన్‌, శాంసంగ్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్స్, లీడింగ్ రిటెయిల్ ఔట్‌లెట్‌ల‌లో ఈ ఫోన్ ల‌భిస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment