Jabardasth Rakesh : రెచ్చిపోతున్న రాకేష్‌, సుజాత జంట‌.. హ‌గ్గులు, ముద్దులు..

August 15, 2022 7:36 AM

Jabardasth Rakesh : ఒక్కోసారి బుల్లితెర కార్యక్రమాల‌ను చూసే ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తుంటాయి. ఏది నిజమో, ఏది అబద్దమో కూడా నమ్మలేని అయోమయ స్థితిలో పడేస్తూ ఉంటారు ప్రేక్షకులని. కార్యక్రమాల‌లో టీఆర్పీల‌ను పెంచుకోవడం కోసం డైరెక్షన్ అండ్ ఎడిటింగ్ టీమ్స్ వారు కొత్త పద్ధతులను అవలంబిస్తుంటారు. మల్లెమాల నిర్వహించే జబర్దస్త్ షో ద్వారా సుడిగాలి సుధీర్, రష్మీ జంట, అదేవిధంగా ఇమ్మాన్యుయేల్, వర్ష జంట ఆన్  స్క్రీన్ లో ఎప్పటికప్పుడు ఒకరిపై ఒకరు ప్రేమను కురిపించుకుంటూ తెగ ఓవరాక్షన్ చేస్తుంటారు.

కానీ వీరు బయట మాత్రం ఒకరి గురించి ఒకరు ఆలోచించకుండా ఎవరి పని వారు చేసుకుంటూ వెళ్లిపోతుంటారు. వారు చేసే కార్యక్రమాల‌ ద్వారా కేవలం వాళ్ల పాపులారిటీని పెంచుకోవడం కోసమే ఇలా చేస్తూ ఉంటారు. ఇప్పుడు రాకింగ్ రాకేష్ కూడా ఇదే పద్ధతిని అనుసరిస్తున్నట్లు ఉన్నాడు. రాజేష్, సుజాత జంట మాత్రం ఎప్పటికప్పుడు ఆన్ స్క్రీన్ మీద కాకుండా ఆఫ్‌ స్క్రీన్ మీద కూడా రెచ్చిపోతున్నారు. ఒకరిపై ఒకరు ముద్దులు, హగ్గులు ఇచ్చుకుంటూ ఇప్పుడు ఆన్ స్క్రీన్ లో రెచ్చిపోవడమే కాకుండా గోవా బీచ్ లో కూడా తెగ హంగామా చేశారు.

Jabardasth Rakesh and Sujatha surprised everybody with their actions
Jabardasth Rakesh

మొన్నటికి మొన్న వరలక్ష్మీ వ్రతం అంటూ రాకేష్ ఇంట్లో సుజాత తెగ హడావిడి చేసింది. శ్రావణ సందడి అనే కార్యక్రమంలో అనసూయ, రవి వ్యాఖ్యాతగా సందడి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో గెస్ట్ గా అందాల రాక్షసి ఫేమ్ హీరో నవీన్ చంద్ర కూడా పాల్గొన్నాడు. శ్రావణ సందడి కార్యక్రమంలో కొంతమంది జబర్దస్త్ ఆర్టిస్టులు, మరికొంతమంది బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కూడా సుజాత, రాకేష్ తమ లవ్ ట్రాక్ కంటిన్యూ చేస్తూ అందరి ముందు  రెచ్చిపోయారు.

షో కోసం షో చేసే లవ్ కాదు.. నిజమైన ప్రేమ మాది. జీవితాంతం కలిసి ఉంటామని  రాకేష్ చెబుతుంటే, సుజాత ఇంకా రెచ్చిపోతూ రాకేష్ ని కౌగిలించుకొని ముద్దులు పెట్టేసింది. ఇది కేవలం పబ్లిసిటీ కోసమా.. లేక వీళ్ళు నిజంగానే పెళ్లి చేసుకోబోతున్నారా.. అనే విషయం వేచి చూస్తే తెలుస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment