Jayam Movie Yamini : జ‌యం సినిమాలో స‌దా చెల్లెలుగా న‌టించిన ఈమె ఇప్పుడు ఎలా ఉందో చూశారా..?

August 14, 2022 10:22 PM

Jayam Movie Yamini : విలక్షణ దర్శకుడు తేజ తెరకెక్కించిన అద్భుతమైన ప్రేమ కావ్యం జయం. ఇందులోని ప్రతి పాత్రను ఎంతో అద్భుతంగా మలిచాడు డైరెక్టర్‌. ఇందులో పక్కింటి అమ్మాయిలా కనిపించే సదా లుక్స్, గోపీచంద్ విలనిజం, ఆర్పీ పట్నాయక్ సంగీతంలో రూపొందిన పాటలు అన్నీ హైలెట్‌గా నిలిచాయి. ముఖ్యంగా ఇందులో అక్షరాలను తిప్పిరాసే హీరోయిన్‌ చెల్లెలి పాత్ర అందరినీ ఆకర్షించింది. తన అక్క ప్రేమ గెలవాలని ఈ పాప చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు.

సుద్ద ముక్కతో అక్షరాలను తిరగేసి రాస్తూ అందరినీ కన్‌ఫ్యూజ్‌ చేస్తుంటుంది. ఈ పాత్రకి గాను ఆ పాపకి నంది అవార్డు లభించింది. ఆ పాప పేరు.. యామిని శ్వేత. ఈమె ప్రముఖ సీరియల్‌ ఆర్టిస్ట్‌ జయలక్ష్మి కూతురు అన్న సంగతి బహుశా ఎక్కువ మందికి తెలిసుండదు. జయం చిత్రం కంటే ముందు యామిని కొన్ని సీరియల్స్‌ లో నటించింది. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లిన ఆమె అక్కడ చదువు పూర్తయ్యాక కొన్నాళ్ళు ఉద్యోగం కూడా చేసింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్న యామినికి ఓ పాప కూడా ఉంది.

Jayam Movie Yamini see how she is changed now
Jayam Movie Yamini

అప్పట్లో యామినికి నచ్చావులే వంటి సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. కానీ వాటిని సున్నితంగా తిరస్కరించింది. ఇక నంది అవార్డుకు వచ్చిన రెమ్యునరేషన్‌ను కూడా మానసిక వికలాంగుల ఆశ్రమానికి దానం చేసి తన గొప్ప మనసును చాటుకుంది. ఇప్పుడు యామిని అందాన్ని చూసి ప్ర‌తి ఒక్క‌రూ ఫిదా అవుతున్నారు. అయితే ఇప్పుడు యామిని శ్వేత సినిమాల్లో నటిస్తే బాగుంటుందని ఆమె అభిమానులు సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు. ఇక ముందైనా సినిమాల్లో నటించేందుకు యామిని ఓకే చెప్తుందో లేదో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment