Kasthuri : నాగార్జున‌తో తొలి చూపులోనే ల‌వ్‌లో ప‌డిపోయా.. ఆయన షేక్ హ్యాండ్ ఇస్తే రోజంతా చేయి క‌డుక్కోలేదు..

August 13, 2022 11:04 AM

Kasthuri : టాలీవుడ్ లో ఎంతోమంది హ్యాండ్సమ్ హీరోలు ఉన్నారు. నిన్నటితరం హీరోల విషయానికి వస్తే నవ మన్మథుడుగా పేరుగాంచాడు అక్కినేని నాగార్జున. ప్రస్తుతం ఆయనకు ఆరుపదుల వయసు వచ్చినప్పటికీ యంగ్ గా కనిపిస్తారు. నాగార్జున స్టైల్ కి ఎంతోమంది అమ్మాయిలు ఫిదా అయ్యారు. నాగార్జునపై మనసు పారేసుకున్న వారు ఎంతోమంది ఉన్నారు. అయితే తాజాగా మరో నటి నాగార్జున అంటే తనకెంతో ఇష్టమని, తొలిచూపులోనే ఆయనతో ప్రేమలో పడ్డానని అంటోంది ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ఫేమ్ కస్తూరి. ఈమె ఇండస్ట్రీలో పలు సినిమాల్లో నటించి అల‌రించారు.

కస్తూరి ప్రస్తుతం గృహలక్ష్మి సీరియల్ లో ప్రధాన పాత్రలో నటిస్తూ బిజీగా ఉంది. కస్తూరి తమిళ‌ ఇండస్ట్రీ ద్వారా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. నెమ్మ‌దిగా హీరోయిన్ గా అవకాశాలను అందుకుంది. అప్పట్లో స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. కమల్ హాసన్ కు సైతం జోడీగా నటించి అలరించింది. ఇక టాలీవుడ్ లో నాగార్జునతో రెండు సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. నాగార్జున హీరోగా నటించిన భక్తిరస చిత్రం అన్నమయ్యలో కస్తూరి కూడా నటించింది. అంతే కాకుండా వీరిద్దరి కాంబినేషన్ లో ఆకాశ వీధిలో అనే మరో సినిమా కూడా వచ్చింది. సినిమాల్లో ఆఫర్ లు తగ్గాక కస్తూరి పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయ్యింది.

Kasthuri told her film shooting experience with Nagarjuna
Kasthuri

ఇక ఇటీవలే రీఎంట్రీ ఇచ్చి వెబ్ సిరీస్ లు, సీరియల్స్ చేస్తోంది. అయితే తాజా ఇంటర్వ్యూలో కస్తూరి ఆసక్తికరమైన‌ కామెంట్స్ చేసింది. నాగార్జునను మొదటిసారి చూసిన రోజే తాను పడిపోయానని చెప్పింది. షూటింగ్ సమయంలో నాగార్జున తనకు షేక్ హ్యాండ్ ఇచ్చార‌ని.. ఆ రోజు మొత్తం ఆ చేతిని కడుక్కోలేదని, ఆ చేతిని ఎవరినీ తాకనివ్వలేదని పేర్కొంది. ఇక నాగ్ పై మనసు పారేసుకున్న హీరోయిన్ లు చాలా మంది ఉన్నారన్న సంగతి తెలిసిందే. టబు అయితే నాగ్ కోసమే పెళ్లికి దూరంగా ఉంది అనే రూమర్ కూడా ఉంది. ఈ క్ర‌మంలోనే క‌స్తూరి చేసిన కామెంట్స్ వైర‌ల్ అవుతున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now